ఆపిల్ సంస్థ ప్రతి ఏటా విడుదల చేసే కొత్త వెర్షన్ ఐఫోన్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అత్యంత ఖరీదైన ఆ ఫోన్లను దక్కించుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఐఫోన్‌ను వాడడం స్టేటస్ సింబల్‌గా భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా ఐఫోన్ 16 విడుదల అయింది.
ఆపిల్ (Apple) సంస్థ ప్రతి ఏటా విడుదల చేసే కొత్త వెర్షన్ ఐఫోన్లకు (iPhone) ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అత్యంత ఖరీదైన ఆ ఫోన్లను దక్కించుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఐఫోన్‌ను వాడడం స్టేటస్ సింబల్‌గా భావించే వాళ్లు చాలా మంది ఉన్నారు. తాజాగా ఐఫోన్ 16 విడుదల అయింది. ఆ ఫోన్ విడుదలైన రోజున చాలా మంది వినియోగదారులు ఆపిల్ స్టోర్ల ముందు పడిగాపులు కాశారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి స్వయంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను (iPhone 16 pro max) పోలి ఉండే ఇనుప నమూనాను తయారు చేశాడు.
uday_fabrication అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో , ఒక వ్యక్తి ఇనుమును కత్తిరించడం, వెల్డింగ్ చేయడంతో సహా నకిలీ ఐఫోన్ 16 ప్రో మాక్స్‌ను ఎలా తయారు చేస్తున్నాడో చూపించారు. కచ్చితమైన పరిమాణం, లోగో నుంచి ట్రిపుల్ కెమెరా సెట్టింగ్ వరకు ప్రతి చిన్న డిటైల్ కూడా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను పోలి ఉంది. దూరం నుంచి చూస్తే అది కచ్చితంగా లక్షలు విలువ చేసే ఐఫోన్ అని నమ్మక తప్పదు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6 కోట్ల మందికి పైగా వీక్షించారు. 26 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. “ఇంత ట్యాలెంట్ ఏంటి భయ్యా“, “ఈ ఐఫోన్ వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కూడా..“, “ఇది సామాన్యుడి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్“, “ఇప్పుడు నేల విరిగిపోతుంది కానీ ఫోన్ విరిగిపోదు“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు