BoAt Wave Fury: రూ. వెయ్యిలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాచ్‌లలో ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. బోట్ వేవ్ ఫ్యూరీ వాచ్‌లో 1.83 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.
ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ అసలు ధర రూ. 6999కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 85 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ వాచ్‌ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
Boult Crown: తక్కువ ధరలో స్టన్నింగ్ లుక్స్, ఫీచర్లతో కూడిన ఈ వాచ్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ వాచ్ అసలు ధర రూ. 4499కాగా ప్రస్తుతం 73 శాతం డిస్కౌంట్‌తో రూ. 1199కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 1.95 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో పాటు మరెన్నో హెల్త్ ఫీచర్లను అందించారు.
Fastrack Revoltt FS2+: ఫాస్ట్‌ట్రాక్ వంటి మంచి బ్రాండ్ వాచ్‌ను ఈ సేల్‌లో తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ వాచ్ అసలు ధర రూ. 2995కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా 63 శాతం డిస్కౌంట్‌తో రూ. 1099కి సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికస్తే ఇందులో బ్లూటూత్ కాలింగ్‌తోపాటు అన్ని రకాల హెల్త్ ఫీచర్లను అందించారు.
Noise Colorfit Icon: ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5999కాగా సేల్‌లో భాగంగా 83 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్‌లో 2.18 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఈ వాచ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఈ వాచ్ సొంతం. బ్లూడ్ ఆక్సిజన్, 24/7 హార్ట్ మానిటరింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.
Noise Icon 2 Elite Edition: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో నాయిస్ ఐకాన్ 2 ఎలైట్ ఎడిషన్ ఒకటి. ఈ వాచ్ అసలు ధర రూ. 6999కాగా 81 శాతం డిస్కౌంట్‌తో రూ. 1299కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌తో ఈ వాచ్‌ను కొనుగోలు చేసే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 1.8 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఈ వాచ్ సొంతం.