ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను ఇవాళ విరమించనున్నారు. ఇప్పటికే తిరుమల చేరుకున్న.. వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.

అనంతరం ఆయన ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..

శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించడం వల్ల అపచారం జరిగిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పవన్ కల్యాణ్.. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు రావడంతో సెప్టెంబరు 22 న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు దీక్షలో ఉన్నారు.

ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు నిన్న రాత్రి అలిపిరి మెట్లమార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు పవన్ కల్యాణ్‌. గోవిందనామస్మరణ చేస్తూ 3,550మెట్లు ఎక్కారు.. కాలినడక మార్గంలో సీసీఎఫ్‌ నాగేశ్వరరావుతో కాసేపు మాట్లాడిన డిప్యూటీ సీఎం రక్షణ ఏర్పాట్లపై ఆరా తీశారు. చిరుతల సంచారం నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.

రాత్రి తిరుమలలో బస చేశారు పవన్ కల్యాణ్. కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యతో కలిసి వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. ఇవాళ తిరుమలలోనే బస చేయనున్నారు పవన్ కల్యాణ్‌. రేపు తిరుపతి వారాహి సభలో పాల్గొంటారు.