నేటి కాలంలో ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగిపోయింది. వివిద అవసరాల కోసం ల్యాప్ టాప్ లను యూజ్ చేస్తున్నారు. కరోనా అనంతరం వర్క్ ఫ్రం హోమ్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. దీంతో ల్యాప్ టాప్ ల వాడకం ఎక్కువైపోయింది. అదే సమయంలో విద్యార్థులు ఆన్ లైన్ క్లాస్ ల కోసం ల్యాప్ టాప్ లను వాడుతున్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ అభ్యసించే విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఉపయోగిస్తున్నారు. మరికొంత మంది ఎంటర్ టైన్ మెంట్ కోసం వాడుతున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలు అడ్వాన్స్డ్ ఫీచర్లతో సరికొత్త ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో బడ్జెట్ ధరల్లోనే లభిస్తున్నాయి. పది వేల కంటే తక్కువ ధరలో ల్యాప్ టాప్ లు లభిస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్లు, క్వాలిటీతో కూడిన ల్యాప్ టాప్ కావాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికోసం బెస్ట్ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో హెచ్ పీ బ్రాండ్ కు చెందిన ల్యాప్ టాప్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 34 వేలు విలువ చేసే ల్యాప్ టాప్ 12 వేలకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ లో హెచ్‌పీ టచ్ క్రోమ్‌బుక్ మీడియాటెక్ ఎంటీ 8183 11 ఎంకే జీ9 క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. దీనిపై 62 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర 34 వేల 554 రూపాయలు. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు 12 వేల 990కే దక్కించుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ 4 జీబీ / 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. క్రోమ్ ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేస్తుంది. 11.6 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో ఒక యూఎస్‌బీ పోర్ట్ 2.0 టైప్ ఏ పోర్ట్, ఒక సూపర్ స్పీడ్ యూఎస్‌బీ టైప్ సీ 5 జీబీపీఎస్ సిగ్నలింగ్ రేటు పోర్ట్ వంటివి ఉంటాయి. స్పీకర్లు, మైక్ వంటివి కూడా ఉంటాయి. డిస్క్ డ్రైవ్ ఉండదు. వెబ్‌కెమెరా ఉంటుంది. మీడియా టెక్ ఎంటీ 8183 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. వైఫై , బ్లూటూత్ 4.2 కనెక్టివిటీతో వస్తుంది.