కొత్తగా పెళ్లైన జంటలకు గోల్డెన్ ఛాన్స్.. ఉచితంగా 2.5 లక్షలు పొందొచ్చు.. ఇలా అప్లై చేసుకోండి

www.mannamweb.com


పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఘట్టం. యువతీ యువకులు పెళ్లి కోసం ఎన్నో కలలుకంటుంటారు. తమ వైవాహిక జీవితం ఇలా ఉండాలని ప్లాన్ చేసుకుంటుంటారు. పెళ్లి సంబంధాల దగ్గర్నుంచి వివాహం అయ్యేంత వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వివాహం అనేది నేటి రోజుల్లో బోలెడంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వివాహ వేదిక దగ్గర్నుంచి బాజాభజంత్రీలు, భోజనాల ఖర్చు, పెట్టుబోతలు ఇవన్నీ కలగలిపి తడిసి మోపెడవుతుంటాయి. పెళ్లి కోసం గొప్పలకు పోయి అప్పుల పాలైన వారూ లేకపోలేదు. ఈ ఏడాది కూడా వివాహాలు జోరుగానే జరిగాయి. చాలా కుటుంబాల్లో అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే నూతనంగా పెళ్లి చేసుకున్న వారు ఉచితంగా 2 లక్షల 50 వేలు పొందొచ్చు. ఏంటీ మ్యారేజ్ చేసుకుంటే 2 లక్షల 50 వేలు వస్తాయా? ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అని ఆశ్చర్యపోతున్నారా? మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. కొత్తగా పెళ్లైన జంటల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ ను అందిస్తోంది. పెళ్లి చేసుకుంటే ఉచితంగా 2 లక్షల 50 వేలు అందిస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలు ఈ డబ్బును పొందొచ్చు. ప్రభుత్వం అందించే ఈ సాయాన్ని ఎలా పొందాలి? అర్హులు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కొంతమంది తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటారు. మరికొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే కొంతమంది కులాంతర వివాహాలు కూడా చేసుకుంటుంటారు.

ఇలాంటి వారికి గుడ్ న్యూస్.కేంద్ర ప్రభుత్వం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కోసం స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వారికి మాత్రమే ఈ బెనిఫిట్ పోందే వీలుంటుంది. అందువల్ల మీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందొచ్చు. అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇటీవల కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు అనేక ఇబ్బందులకు గురవుతున్నాయి. అబ్బాయి లేదా అమ్మాయి కుటుంబాల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ను వ్యతిరేఖించడంతో గొడవలు జరుగుతున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న జంటలపై దాడులు కూడా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు అండగా నిలిచేందుకు, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇన్సెన్‌టివ్ అవార్డ్ (ఎస్‌సీ డెవలప్‌మెంట్) పేరుతో స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే రూ.2.5 లక్షలు వస్తాయి. అయితే వధూవరులలో ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారై ఉండాలి. అప్పుడే ఈ స్కీమ్ వర్తిస్తుంది. తెలంగాణ ఇపాస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చు.

వధూవరుల ఆధార్ కార్డులు, జాయింట్ బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్స్, మ్యారేజ్ సర్టిఫికెట్, అడ్రస్ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పరిశీలన అనంతరం కొత్తగా పెళ్లైన జంటలకు వారి బ్యాంకు ఖాతాలో రూ.1.5 లక్షలు జమ చేయబడతాయి. మిగిలిన 1 లక్ష రూపాయలు మీకు ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ఇవ్వబడుతుంది. తొలిసారి కులాంతర విహహం చేసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. రెండో పెళ్లి, మూడో పెళ్లికి పథకం వర్తించదు. అలాగే పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం పొందటానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.