సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు – మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..!

www.mannamweb.com


సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 12 ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 05వ తేదీతో అప్లికేషన్ల గడువు పూర్తి అవుతుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

సికింద్రాబాద్ లోని గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో పలు రకాల పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం ఖాళీలు 12 ఉన్నాయి. ఆయా పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూలు నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు.

8వ తేదీన ఇంటర్వ్యూలు ..

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అక్టోబర్ 5వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు అక్టోబర్ 08వ తేదీన ఇంటర్వూలు నిర్వహిస్తారు. పోస్టును బట్టి జీతాలను నిర్ణయించారు.
12 ఖాళీలు…

నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం… సైంటిస్ట్‌ సి (మెడికల్/ నాన్‌ మెడికల్) పోస్టులు 3 ఉండగా… డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ రెండు ఉండగా..రిసెర్చ్‌ అసిస్టెంట్‌ ఖాళీలు 2 ఉన్నాయి. రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టు ఒకటి ఉండగా.. ల్యాబ్‌ టెక్నీషియన్ ఒక పోస్టు ఉంది. ప్రాజెక్ట్‌ టెక్నికల్ ఆఫీసర్‌ (గ్రేడ్ 3) కూడా ఒక్క పోస్టే ఉంది. అన్ని కలిపి 12 ఉన్నాయి.

ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఎన్ బీలో ఉత్తీర్ణత ఉండాలి. పోస్టును బట్టి విద్యార్హతలు ఉంటాయి. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు. సైంటిస్ట్‌ సి పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.67,000 చెల్లిస్తారు. రిసెర్చ్‌ అసోసియేట్‌కు నెలకు రూ.56,840, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు నెలకు రూ. 32,350 జీతం ఇస్తారు.దరఖాస్తు ఫారమ్ ను గాంధీ మెడికల్ కాలేజీ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వివరాలను పూర్తి చేసి.. గాంధీ మెడికల్ కాలేజ్‌, ప్రిన్సిపల్, జీఎంసీ, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. ఆయా దరఖాస్తులను పరిశీలించి… షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారిని అక్టోబర్ 8వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనే ఉదయం 11 నుంచి ఇంటర్వూలు ప్రారంభమవుతాయి.

వైద్యారోగ్యశాఖ నుంచి త్వరలో మరో నోటిఫికేషన్:

ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ఉన్న ESI ఆస్పత్రుల్లో కూడా ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. మొత్తం 600 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో అత్యధికంగా 272 స్టాఫ్ నర్సుల పోస్టులు న్నాయి. ఆ తర్వాత సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 124గా పేర్కొన్నారు.గ్రేడ్‌-2 ఫార్మాసిస్ట్‌ 99 ఖాళీలు ఉండగా…ల్యాబ్‌టెక్నీషియన్‌ ఉద్యోగాలు 34 ఉన్నాయి.

డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు 7, ANM 54 ఖాళీలు ఉండగా.. రేడియోగ్రాఫర్‌ 5, మూడు డెంటల్‌ టెక్నీషియన్ ఖాళీలు ఉన్నాయి.ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌ ఒకటి ఉండగా డెంటల్‌ హైజనిస్ట్ ఒక్క ఖాళీ ఉంది. త్వరలోనే వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.ఈ ఉద్యోగాలను వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) ద్వారానే భర్తీ చేయనున్నారు.