గృహ రుణం తీసుకోవాలని అనుకుంటున్నారా..? ఆ బ్యాంకుల్లో వడ్డీ ఎంతంటే..?

www.mannamweb.com


ప్రస్తుత రోజుల్లో పెరిగిన రేట్లు సామాన్యుడు సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే తప్పనిసరిగా గృహరుణం తీసుకోవాల్సి వస్తుంది. అయితే రుణం పొందే సమయంలో తిరిగి చెల్లించగలిగే సామర్థ్యాన్ని కూడా బేరీజు వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా గృహ రుణాలను వేతన జీవులు తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారి నెలవారీ అవసరాలకు అనుగుణంగా గృహ రుణ ఈఎంఐలను పెట్టుకోవాలని పేర్కొంటున్నారు. అయితే ఈఎంఐ తగ్గాలంటే వడ్డీ రేటు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఒక్క శాతం వడ్డీ తగ్గినా లక్షల్లో లాభపడవచ్చు. మంచి క్రెడిట్‌ స్కోర్‌తో పాటు ఇతర విషయాలు అనేవి వడ్డీ రేటు విధింపులో కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో ఏయే బ్యాంకులు గృహ రుణాలకు ఏ మేరకు వడ్డీ విధిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

ప్రభుత్వ రంగ బ్యాంకులు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై ఈఎంఐ వ్యవధికి అనుగుణంగా 8.35 శాతం నుండి 10.90 శాతం వరకు వడ్డీ రేటును విధిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 10.90 శాతం మధ్య ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.40 శాతం నుంచి 10.25 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది,
బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 10.85 శాతం మధ్య ఉంది.
యుకో బ్యాంక్ 8.45 శాతం నుంచి 10.30 శాతం మధ్య గృహ రుణాలను అందిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.50 శాతం నుంచి 9.85 శాతం వరకు గృహ రుణాలను అందిస్తుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 8.50 శాతం నుంచి 10.00 శాతం మధ్య గృహ రుణాలపై వడ్డీ రేటును వసూలు చేస్తుంది.

ప్రైవేట్ రంగ బ్యాంకులు

సిటీ యూనియన్ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేట్లను 8.45 శాతం నుంచి 10.70 శాతం వరకు విధిస్తుంది.
హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ వడ్డీ రేటు 8.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది.
కర్ణాటక బ్యాంక్ వడ్డీ రేట్లను 8.50 శాతం నుంచి 10.62 శాతం వరకు విధిస్తుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల వడ్డీ రేటు 8.75 శాతం నుంచి ప్రారంభమవుతుంది.
యాక్సిస్ బ్యాంక్ 8.75 శాతం నుంచి 13.30 శాతం వరకు ఆఫర్ చేస్తుంది.
ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు8.80 శాతం నుంచి ప్రారంభం అవుతాయి.

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు

ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీ రేట్లను 8.50 శాతం నుంచి 10.75 శాతం వరకు అందిస్తుంది.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీ రేటు 8.50 శాతం నుండి ప్రారంభమవుతుంది.
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 14.50 శాతం మధ్య ఉంటుంది.
గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ వడ్డీ రేటు 8.55 శాతం నుంచి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ 8.60 శాతం నుండి మొదలవుతుంది.
టాటా క్యాపిటల్ 8.75 శాతం నుంచి, సమ్మాన్ క్యాపిటల్ 8.75 శాతం నుండి అందిస్తుంది.