ఐసీఐసీఐ బ్యాంకులో భారీ గోల్ మాల్

www.mannamweb.com


నమ్మకానికి అమ్మలాంటివి బ్యాంకులు. వీటిల్లో తమ నగదుకు, వస్తువులకు భద్రత ఉంటుందని కస్టమర్లు విశ్వసిస్తుంటారు. కానీ ఇవే బ్యాంకులు వినియోగదారుల్ని నిలువెల్లా మోసం చేస్తున్నాయి. బ్యాంకు సిబ్బందే చేతి వాటం ప్రదర్శిస్తూ కస్టమర్ల సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐలో చోటుచేసుకున్న గోల్ మాల్ వెలుగు చూసింది. ప్రజల సొమ్మును కొట్టేశారు బ్యాంక్ సిబ్బంది. నగదు డిపాజిట్ చేసిన కస్టమర్లు తమ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు పడకపోవడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో లబోదిబో మంటున్నారు కస్టమర్లు. బ్యాంకు దగ్గరకు వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు కస్టమర్లను సొమ్మును కొట్టేసిన ఈ బ్యాంక్ ఎక్కడుదంటే.. పల్నాడు జిల్లాలోని చిలకలూరి పేటలో. కోట్లాది రూపాయల సొమ్ముపై కన్నేసిన సిబ్బంది .. పెద్ద మొత్తంలో డబ్బు, బంగారాన్ని కాజేశారు.

చిలకలూరి పేట ఐసీఐసీఐ బ్రాంచులో ఎంతో మంది కస్టమర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాట్లు చేయడంతో పాటు గోల్ట్ లోన్లు తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల నుండి ఆర్డీ ఖాతాదారుల్లో వడ్డీ తీసుకునేందుకు బ్యాంకుకు రాగా, ఆ సమయంలో వారి ఖాతాల్లో డబ్బులు మాయం కావడాన్ని గుర్తించారు. సిబ్బందిని ప్రశ్నించగా.. వాళ్లు చేతులేత్తేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పడు కానీ తెలియలేదు బ్యాంకులో పెద్ద గోల్ మాల్ జరిగింది. ఈ విషయం ఇది ఆ నోట, ఈ నోట బయటకు వచ్చేసింది. దీంతో డిపాజిటర్లు పెద్ద యెత్తున బ్యాంకు దగ్గరకు వచ్చి.. తమ డిపాజిట్ డబ్బులు ఉన్నాయా లేదా అంటూ ప్రశ్నించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా.. భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు ఉన్నాతాధికారులు.

దీంతో బ్యాంక్ జనరల్ మేనేజర్, రీజనల్ హెడ్, ఇతర ఉన్నతాధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. సుమారు 30 కోట్ల రూపాయల వరకు ఖాాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. ఈ గోల్ మాల్ జరగడానికి గతంలో ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్‌ చేయకపోవడం, ఓవర్‌ డ్రాఫ్ట్‌లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచార­ణలో వెలుగు చూసింది. రూ.6.9­కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్‌మాల్‌ జరిగిందని చెబుతున్నారు. దీంతో బ్యాంకు ఖాతాదారులు పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. కాగా, దీనిపై జోనల్ మేనేజర్ వివరణ కోరగా.. విచారణ జరుపుతున్నామని, పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కానీ కస్టమర్లు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బు సేఫా కాదా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.