ఈ చిన్న తప్పులే.. మీ జీవితాన్ని డేంజర్‌లో పడేస్తాయి..

www.mannamweb.com


తక్కువగా నీరు తాగడం ఏమాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సరిపడ నీరు తాగకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

శరీరాన్ని నిత్యం హైడ్రేట్‌గా ఉండాలంటే నీరు క్రమంతప్పకుండా తీసుకోవాలి. ప్రతీరోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి. శరీరంలో నీరు తాగితే అలసట, తలనొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతుంటారు.

తీసుకునే ఆహారం మంచిది అయి ఉండాలన్న దాంట్లో ఎంత వరకు నిజం ఉందో తీసుకునే సమయం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది ఊబకాయం, అసిడిటీ వంటి కడుపు సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి పెరిగితే అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందుకే యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని కచ్చితంగా రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శారీరక శ్రమ చేయకపోవడం కూడా మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా రోజూ వాకింగ్ చేయడం లేదా ఏదో ఒకరకమైన శారీరక శ్రమ చేయాలి. శారీరక శ్రమను పూర్తిగా తగ్గించడం వల్ల గుండె జబ్బులు, షుగర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

తీసుకునే ఆహారంలో విషయంలో చేసే తప్పులు కూడా అనారోగ్యానికి దారి తీస్తాయి. ఇది కూడా మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్‌పుడ్‌, స్నాక్స్‌ తీసుకోవడాన్ని వీలైనంత వరకు తగ్గించాలని అంటున్నారు. ఈ రకమైన ఫుడ్‌ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇది తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తాయి.