సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో ఇంటర్న్‌షిప్ కోసం టెక్ దిగ్గజం గూగుల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్ కోర్సు 22 నుంచి 24 వారాల పాటు ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చేసిన వారు లేదా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న వారు గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే వారికి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అనుభవం ఉండాలి. కోడింగ్ అనుభవంతో పాటు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ Java, JavaScript, C, C++, Python లేదా సంబంధిత భాషల్లో ప్రమేయం ఉండాలి.
లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ సిస్టమ్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్ వటి విభాగాల్లో కూడా ఇంటర్న్‌షిప్ అవకాశం ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ google.com/about/careersని సందర్శించాలని చెబుతున్నారు. ఇందులో గూగుల్ ఇంటర్న్‌షిప్ 2024 అప్లై చేసుకోవాలి. అర్హతల ఆధారంగా గూగుల్ ఈమెయిల్ ద్వారా అభ్యర్థులను సంప్రదిస్తుంది.
గూగుల్ ఈ ఇంటర్న్‌షిప్‌ను జనవరి 2025 నుంచి ప్రారంభిస్తుంది. సాధారణంగా ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి 22 నుంచి 24 వారాల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం మారిన టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన కోర్సుల్లో రాణించాలనుకునే వారికి ఈ ఇంటర్న్‌షిప్ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు.