నూనె రాసుకుని స్నానం చేస్తే ఏం జరుగుతుందంటే

www.mannamweb.com


ఇప్పుడు అంతా బిజీ బిజీ లైఫ్ స్టైల్‌గా మారిపోయింది. ఎన్నో కొత్త అలవాట్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆహారంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల..

చర్మం, జుట్టుపై కూడా ఎఫెకట్ పడుతుంది.

ఈ కాలంలో నూనెను చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. జుట్టుకు కూడా సరిగా పెట్టడం లేదు. దీంతో జుట్టు బలహీనంగా తయారై.. రాలిపోతుంది. అలాగే చర్మం కూడా దెబ్బతిని అందవిహీనంగా తయారవుతుంది.

తల స్నానం చేయడానికి ముందు జుట్టుకు ఒత్తుగా ఆయిల్ పెట్టి స్నానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. జుట్టు మెత్తగా, సిల్కీగా ఉంటుంది. రాలడం తగ్గి.. బలంగా మారుతుంది.

అదే విధంగా ఒటికి రాసుకుని స్నానం చేయడం వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్వం ఇలానే స్నానం చేసేవారు. ఒంటికి నూనె రాసుకుని స్నానం చేయడం వల్ల ఎలాంటి లోషన్లు, క్రీములు అవసరం లేదు.

చర్మం కాంతివతంగా మెరిసి పోతుంది. మంచి హైడ్రేట్‌గా ఉంటుంది. కొబ్బరి, బాదం, నువ్వుల నూనెలతో బాడీని మసాజ్ చేయడం వల్ల చర్మం లోలోపల పొరులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. డ్రై స్కిన్ కూడా తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. )