అట్టహాసంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక.. ఎవరికి ఏ అవార్డ్ వచ్చిందంటే..

www.mannamweb.com


భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకను ఢిల్లీలోని విజయ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు.

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్ లో మంగళవారం అట్టహాసంగా జరగ్గా.. ఈ ఏడాది సినీరంగంలోని విజేతలకు రాష్ట్రపతీ ద్రౌపదీ ముర్ము పురస్కారాలు అందజేశారు. 2022కి గానూ కేంద్రం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను విజేతలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ వేడుకకు దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తమ నటిగా తిరుచిత్రంబలం కు నిత్యా మీనన్.. ఉత్తమ నటుడిగా కాంతార కు రిషబ్ శెట్టి అవార్డ్ అందుకున్నారు.

అలాగే కార్తీకేయ 2 దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా మాలయళం నుంచి ఆట్టమ్, తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ గా కార్తికేయ 2 నిలిచాయి. ఉత్తమ నటిగా మాసని పరేఖ్ కచ్ ఎక్స్ ప్రెస్ కు అవార్డ్ అందుకున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవార్డ్ వచ్చిందో తెలుసుకోండి.

70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్..

ఉత్తమ చిత్రం.. ఆట్టమ్ (మాలయాళం)
ఉత్తమ పాపులర్ ఫిల్మ్.. కాంతార
ఉత్తమ నటుడు.. రిషబ్ శెట్టి (కాంతార)
ఉత్తమ నటి.. నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్)
ఉత్తమ దర్శకుడు.. సూరజ్ బర్జాత్య
ఉత్తమ సహయ నటి.. నీనా గుప్తా
ఉత్తమ సహయ నటుడు.. పవన్ మల్హోత్రా.
ఉత్తమ నూతన నటుడు.. ప్రమోద్ కుమార్.
ఉత్తమ ప్రాంతీయ తెలుగు.. కార్తికేయ 2
ఉత్తమ తమిళ్ .. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1
ఉత్తమ పంజాబీ .. భాగీ ది డీ..
ఉత్తమ ఓడియా మూవీ.. దమన్..
ఉత్తమ మలయాళీ .. సౌదీ వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)
ఉత్తమ మరాఠీ .. వాల్వీ..
ఉత్తమ కన్నడ .. కేజీఎఫ్ చాప్టర్ 1
ఉత్తమ హిందీ .. గుల్ మోహర్
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్.. కేజీఎఫ్
ఉత్తమ కొరియోగ్రఫరీ.. తిరుచిత్రంబలం.
బెస్ట్ లిరిక్స్.. ఫౌజా..
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రితమ్ (సాంగ్స్), ఏఆర్ రెహమాన్ (బ్యాగ్రౌండ్ స్కోర్)
ఉత్తమ మేకప్.. ఆపరాజితో
ఉత్తమ కస్ట్యూమ్స్.. కచ్ ఎక్స్ ప్రెస్.
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్.. అపరాజితో
ఉత్తమ ఎడిటింగ్.. ఆట్టమ్..
బెస్ట్ సౌండ్ డిజైన్.. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1
ఉత్తమ స్క్రీన్ ప్లై.. ఆట్టమ్..
ఉత్తమ డైలాగ్స్.. గుల్ మొహర్..
ఉత్తమ టోగ్రఫీ.. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1
ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్.. సౌదీ వెళ్లక్క సీసీ 225/2009
ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్. బ్రహ్మాస్త్ర