ఆ గ్రామం పూల ఇంద్రధనస్సు.. బతుకమ్మ కోసమే.. పువ్వుల సాగు..

www.mannamweb.com


పువ్వులను దైవంగా పూజించే పండగ బతుకమ్మ పండగ.. నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయంటే చాలు ఓ వైపు అమ్మవారి ఆరాధన, మరోవైపు బతుకమ్మ సంబురాలు సందడి నెలకొంటుంది.

దీంతో రంగు రంగుల పువ్వులు అలరిస్తున్నాయి. ఈ గ్రామం బతుకమ్మ పువ్వులకు ప్రత్యేకం. ఈ గ్రామంలో అడుగుపెడుతే చాలు పువ్వుల తోటలు దర్శన స్తాయి. ఈ తోటలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అయితే.. బతుకమ్మ పండుగ కోసమే.. ఈ గ్రామంలో పువ్వుల సాగు చేస్తున్నారు. జనం ఇక్కడికి వచ్చి.. పువ్వులను కొనుగోలు చేస్తున్నారు.. దాదాపునా అన్ని రకాల పువ్వుల తోటను సాగు చేస్తున్నారు. ఫోన్లో ద్వారా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. బతుకమ్మ పువ్వుల విలేజీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పువ్వుల సాగుకు ప్రత్యేకం. అయితే ఇక్కడ మాత్రం బతుకమ్మ కోసమే పువ్వుల తోటలను సాగు చేస్తున్నారు. బతుకమ్మ పండుగకు నెల రోజులే ముందే నారు పోస్తారు. బతుకమ్మ పండుగ వచ్చేనాటికి పువ్వులు చేతికొస్తాయి. ఇప్పుడు అన్ని రకాల పువ్వుల పూస్తున్నాయి. బంతి, చామంతి, పట్టుగుచ్చు, గులాబీ తదితర పువ్వుల తోటలు కనబడుతున్నాయి.. రైతులు సాంప్రదాయ పంటలకు బదులు సీజనల్ పంటలను సాగు చేస్తున్నారు.

ఇప్పుడు ఈ గ్రామంలో ఎటు చూసిన పువ్వుల తోటలు కనబడుతున్నాయి. ఎక్కడో కశ్మీర్లాగా ఈ ప్రాంతం కనబడుతుంది. అంతేకాదు ఈ పువ్వుల తోటలను చూడటానికి జనం వస్తున్నారు. ఇప్పుడు సద్దుల బతుకమ్మ కోసం ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. దసరా పండుగ కోసం కూడా పువ్వులు. ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ గ్రామంలో అధికంగా పట్టుగుచ్చును సాగు చేస్తున్నారు. బతుకమ్మను పేర్చేందుకు… ప్రతి చుట్టుకు పట్టుగుచ్చు పెడుతారు. దీంతో… ఇక్కడ పట్టుగుచ్చు దొరుకుతుంది.

తరువాత. బంతి, చామంతిలను వినియోగిస్తున్నారు. ఈ రెండు పంటలు కూడా ఎక్కువ సాగు చేశారు. మధ్య, మధ్యలో గులాబీలను వాడుతారు. గులాబీలు మొక్కలను కూడా పెంచారు. ఇప్పటి నుంచే పువ్వులను కొనుగోలు చేసి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ తోటలు బిజిగా మారనున్నాయి.

గురువారం సద్దుల బతుకమ్మ పండుగ కావడం తో.. పువ్వులు కోస్తున్నారు. ఈ పువ్వులను కరీంనగర్ నుంచి మాత్రమే కాదు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల ప్రజలు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో ఇపుడు ఆ గ్రామం మొత్తం సందడి, సందడి గా ఉంది.

బతుకమ్మ పండుగ కోసమే… పువ్వుల తోటలను సాగు చేస్తున్నామని రైతులు అంటున్నారు. వివిధ రకాల పువ్వుల తోటలను సాగు చేశామని రైతులు అంటున్నారు. బతుకమ్మ పండుగ కోసం ఈ పువ్వులు వాడుతున్నారని తెలుపుతున్నారు. ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నారని చెబుతున్నారు.