యాపిల్ బ్రాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా బజ్ ఏర్పడుతుంది.
తాజాగా యాపిల్ తీసుకొచ్చిన ఐఫోన్16 భారీగా అమ్మకాలు జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా యాపిల్ నుంచి మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. ఐఫోన్ ఎస్‌ఈ4 పేరుతో మిడ్ రేంజ్ బడ్జెట్ మూవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ ఎస్‌ఈ4 ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత ఉండొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ ఎస్‌ఈ4 ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే Michael Tigas ప్రకారం ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధిత కొన్ని వైరల్ అవుతున్నాయి. ఈ ఫోన్ సింగిల్ కెమెరాతో రానున్నట్లు లీక్ అయిన ఫొటో చెబుతోంది. ఈ ఫోన్‌లో 6.06 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఐఫోన్ ఎస్3 ఫోన్‌కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు.
ఈ ఫోన్‌లో ఫేస్ ఐడీని తీసుకొస్తున్నారు. యాపిల్‌లో టచ్ ఐడీ కాకుండా ఫేస్ ఐడీతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇక ఈ ఫోన్‌ను మిడ్ రేంజ్ బడ్జెట్‌లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో యూఎస్‌బీ-సీ పోర్టును అందించనున్నారు. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఇందులో పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను ఇవనున్నారని సమచారం. ఇక ఇందులో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్‌ను ఇవ్వనున్నారు. ఇక ధర విషయానికొస్తే ఎలాంటి క్లారిటీ లేకపోయినా. బేస్ వేరియంట్ రూ. 40 వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి వీటన్నింటికీ సంబంధించి క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.