పోషకాల పవర్ హౌస్ బొప్పాయి.. ఎప్పుడు తింటే మంచిదంటే.

www.mannamweb.com


పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎవరూ పెద్దగా తీసుకోరు. ఒక్కో టైమ్‌లో ఒక్కో పండు తింటే ఉండే లాభాలే వేరు. ఇలా మీకు మేలు చేసే వాటిల్లో బొప్పాయి కూడా ఒకటి.

బొప్పాయితో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు.

ప్రతి రోజూ ఉదయం బొప్పాయిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో కొద్దిగా తీసుకున్నా చాలా మంచిది. దీని వల్ల మీ ఆరోగ్యంతో పాటు చర్మ అందం కూడా పెరుగుతుంది. జీర్ణ సమస్యలు, మలబద్ధకం సమస్యలతో బాధ పడేవారు ఖచ్చితంగా బొప్పాయిని తీసుకోవచ్చు.

ఉదయం తినడం ఇష్టం లేనివారు సాయంత్రం లేదంటే రాత్రి కూడా తీసుకోవచ్చు. సాయంత్రం 4 లేదా 5 గంటల సమయంలో తీసుకోవచ్చు. రాత్రి తీసుకోవాలి అనుకునేవారు భోజనం చేసిన రెండు గంటల తర్వాత తీసుకుంటే పోషకాలు అందుతాయి.

షుగర్ ఉన్నవారు బొప్పాయిని ఉదయం తినకపోవడం మంచిది. బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు, చెడు పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

ఉదయం బొప్పాయి తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తక్షణమే శక్తి అందుతుంది. కాబట్టి స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లే వారు ఉషారుగా ఉంటారు. పిల్లలకు లంచ్ బాక్సులో పెడితే.. బ్రేక్ టైమ్‌లో తింటారు.