మిడిల్ క్లాస్ వాళ్లకు ఎక్కువగా నచ్చే తోపు టూ వీలర్స్.. లీటర్ పెట్రోల్‌తో మస్తు మైలేజీ

www.mannamweb.com


మధ్యతరగతివారు టూ వీలర్ కొనాలంటే ముందుగా చూసేంది ధర, మైలేజీ. ఈ రెండు అనుకున్న రేంజ్‌లో ఉంటే ఏం ఆలోచించకుండా కొనేస్తారు. అలాంటి టూ వీలర్స్ కొన్ని ఉన్నాయి.

టూ వీలర్ మార్కెట్‌ ఇండియాలో చాలా పెద్దది. దాదాపు ప్రతీ ఇంటికి ఒక బైక్ ఉంటుంది. ఇప్పుడు బైక్ లేనివారు చాలా తక్కువ. అయితే మధ్యతరగతివారు ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో ప్రజలు టూ వీలర్ ధర, మైలేజీ గురించి ఎక్కువగా ఆరా తీస్తారు. ఎందుకంటే ఇంధనం ఖర్చుల భరించలేక. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాటిపై ఆసక్తి చూపిస్తారు. ఈ లిస్టులో హీరో, టీవీఎస్ లాంటి కంపెనీలు ఉన్నాయి.

హీరో స్ప్లెండర్ బైక్ గురించి మిడిల్ క్లాస్ వాళ్లకి చాలా బాగా తెలుసు. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారు ఇలాంటి బైకులనే ఎక్కువ ఎంచుకుంటారు. రైతులు కూడా హీరో స్ప్లెండర్ బైకులపై ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వాటి మైలేజీ అలా ఉంటుంది. ధర కూడా అందుబాటులో ఉంటుంది. స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ వేరియంట్‌లు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. స్ప్లెండర్ ప్లస్ రూ.76,356 నుండి రూ.77,496వరకు ఎక్స్ షోరూమ్ ధరగా ఉంది. ఇందులో 97.2 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. సుమారు 80.6 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ బైక్ ధర రూ. 97,089 నుండి రూ. 1 లక్ష వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది 97.2 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 8.02 పీఎస్ హార్స్ పవర్, 8.05 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ బైక్ 83.2 కేఎంపీఎల్ మైలేజీని ఇస్తుంది.

హోండా డియో స్కూటర్ 110 సిసి, 125 సిసి మోడళ్లలో అందుబాటులో ఉంది. డియో 110 ఎక్స్-షోరూమ్ ధర రూ.75,630 నుండి రూ.82,580 వరకు ఉంది. ఇది 50 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. 109.51 సీసీ ఇంజిన్‌ను ఉంది. కొత్త హోండా డియో 125 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.85,049 నుండి రూ.92,950 మధ్య ఉంది. 123.92 సీసీ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 48 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది.

ఇక ఊర్లలో ఎక్కువగా పొలాల దగ్గరకు ఉపయోగించే బండి టీవీఎస్ ఎక్స్ఎల్100. ఈ మోపెడ్ ధర రూ. 44,999 నుండి రూ. 59,014గా ఉంది. 99.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 80 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. ఇది బూడిద-నలుపు, ఎరుపు-నలుపుతో సహా అనేక రంగులో దొరుకుతుంది. ఇప్పుడు కొత్త ఫీచర్లతో ఈ టూ వీలర్ మార్కెట్‌లోకి వచ్చింది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే టూ వీలర్ కోసం చూస్తుంటే మిడిల్ క్లాస్ వాళ్లకు ఇవి బెస్ట్ ఆప్షన్.