మనీలాండరింగ్ కేసులో తమన్నా.. మిల్కీ బ్యూటీని ప్రశ్నించిన ఈడీ.. అసలేం జరిగిందంటే..

www.mannamweb.com


టాలీవుడ్ హీరోయిన్ తమన్నాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ చేపట్టారు. అక్రమ నగదు బదిలీ ఆరోపణలపై ఈడీ ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాలు తెలిపాయి.

HPZ టోకెన్ మొబైల్ యాప్‏కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమన్నాను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీలను మైనింగ్ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో తమన్నా పై ఎలాంటి నేరారోపణలు లేవు. కానీ కేవలం యాప్‏ను ప్రమోట్ చేసినందుకే ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి తన తల్లితో కలిసి వచ్చింది తమన్నా. యాప్‏ను ప్రమోట్ చేశారని.. అందుకు కొంత డబ్బు కూడా తీసుకున్నారని.. ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవని సంబంధిత వర్గాలు స్పష్టం చేయగా.. నిన్న తమన్నా వాంగూల్మం తీసుకున్నారు.

తమన్నా భాటియా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు హాజరుకావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మహదేవ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో తమన్నాను విచారించింది. మహాదేవ అనుబంధ సంస్థ అయిన ఫెయిర్ ప్లే యాప్‏లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గేమ్ మ్యాచులను ప్రసారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మహారాష్ట్ర సైబల్ సెల్ ఏప్రిల్ ను విచారణకు పిలిచింది. మార్చిలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో 76 చైనీస్ నియంత్రిత సంస్థలతో సహా 299 సంస్థలను నిందితులుగా చేర్చింది. ఇందులో పది మంది చైనీస్ మూలాలు ఉన్న డైరెక్టర్లు ఉన్నారు. రెండు సంస్థలు ఇతర విదేశీ పౌరులతో నియంత్రించబడుతున్నాయని పేర్కొంది.

HPZ యాప్ ద్వారా పెద్ద స్కామ్ జరిగింది. ప్రతిరోజు రూ.4 వేలు లాభం ఇస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.57 వేలు తీసుకున్నారు. నకిలీ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి అక్రమ నగదు బదిలీ. దీనికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు రూ.497.20 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు. కోట్లాది రూపాయల కుంభకోణానికి కారణమైన హెచ్‌పిజెడ్ యాప్‌ను తమన్నా ప్రమోట్ చేశారు. అందుకు తమన్నా భారీగానే పారితోషికం తీసుకుంది. దీంతో ఈ కేసులో తమన్నాను ఈడీ విచారిస్తోంది.