వయసులో ఉన్నప్పుడు చేసే ఈ తప్పులు చిన్న వయసులోనే కీళ్ల నొప్పులకు దారి తీస్తాయ్‌

www.mannamweb.com


వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు సర్వసాధారణం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కీళ్ళు, కండరాలలో నొప్పి సంభవిస్తుంది. ఇదేకాకుండా కీళ్ల నొప్పులకు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

ఎముకలు బలహీనపడటం, యూరిక్ యాసిడ్ పెరగడం, ఆర్థరైటిస్, బలమైనా గాయాలు మొదలైనవి ఉన్నాయి. గతంలో వృద్ధాప్యానికి కీళ్ల నొప్పులు కారణమని చెప్పేవారు. అయితే నేటి రోజుల్లో ఆర్థరైటిస్ సమస్యలు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తప్పుడు ఆహారం తీసుకోవడం

విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించే పోషకాలు. కాల్షియం లోపాన్ని అందించే ఆహారాన్ని తీసుకోకపోతే ఎముకలు బలహీనపడతాయి. దీనివల్ల మీరు చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల బారిన పడవచ్చు. కాబట్టి గుడ్లు, ఎండు చేపలు, పాలు, ఇతర పాల ఉత్పత్తులు, ధాన్యాలు మొదలైనవి మీ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. అలాగే కండరాల నొప్పులను నివారించడానికి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం

మీరు పని చేస్తున్నప్పుడు లేదా ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నప్పుడు ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చుంటే భుజం కీళ్లు, మోకాలు, మెడ, వెనుక కండరాలలో నొప్పి వస్తుంది. కాబట్టి కనీసం ప్రతి 40 నిమిషాలకు విరామం తీసుకోవాలి. లైట్ స్ట్రెచింగ్ లేదా వాకింగ్ చేయాలి.

బరువు నియంత్రణలో ఉండాలి

మీరు బరువు పెరుగుతున్నట్లయితే, సమయంపై దృష్టి పెట్టాలి. లేదంటే తర్వాత చాలా కష్టం అవుతుంది. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచడమే కాకుండా కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది శరీరంలో అవయవాల నొప్పి సమస్యను కలిగించవచ్చు.

వ్యాయామం చేయకపోవడం

యోగా, జాగింగ్, సైక్లింగ్, లైట్ స్ట్రెచింగ్ వంటి ఏదైనా శారీరక శ్రమను రోజువారీ దినచర్యలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఆధునిక జీవనశైలిలో ఆహారం సరైనది కాదు. దీని కారణంగా మీ శరీరం సరైన కదలికలు సంభవించవు. దీంతో కీళ్ల నొప్పులు, కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వ్యాయామం లేకపోవడం వల్ల అనేక ఇతర శారీరక సమస్యలు కూడా పెరుగుతాయి.

అనారోగ్యకరమైన ఆహారాలు

కొంతమందికి అన్నీ తెలిసినప్పటికీ అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటూనే ఉంటారు. ఇది అనేక వ్యాధులకు దారి తీస్తుంది. ఉదాహరణకు శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగిన తర్వాత, ఈ లక్షణాలు ఆర్థరైటిస్‌గా మారవచ్చు. దీని వల్ల చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల సమస్య రావచ్చు. కాబట్టి ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.