సల్మాన్‌కు వై-ప్లస్ సెక్యూరిటీ.. బాలీవుడ్ హీరో భద్రత కోసం ప్రభుత్వం ఏటా ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుందో తెలుసా?

www.mannamweb.com


ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు వై+ భద్రత కల్పించింది ప్రభుత్వం. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నే బాబా సిద్ధిఖీని హత్య చేసినట్లు ప్రకటించింది.

సల్మాన్ ఖాన్‌తో స్నేహం కారణంగానే బాబా సిద్ధిఖీ హత్య జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత సల్మాన్ నివాసముండే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో సల్మాన్ భద్రత కోసం ప్రభుత్వం బాగానే ఖర్చు పెడుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. కాగా ప్రముఖుల భద్రతకు సంబంధించి X, Y, Y+, Z, Z+, SPG ఇలా మొత్తం ఆరు కేటగిరీలు ఉన్నాయి. ప్రధాన మంత్రి తదితరులకు SPG భద్రత కల్పిస్తుంది. ఇక సల్మాన్ కు కేటాయించిన Y+ కేటగిరీలో మొత్తం 11 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. సల్మాన్ తో పాటు అతని ఇంటికి కూడా శిక్షణ పొందిన సాయుధ కానిస్టేబుల్స్ ఉంటారు. అలాగే నటుడికి ఎస్కార్ట్‌ వాహనం కూడా ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా తోడుగానూ ఉంటారు. కాగా ఇక రిపోర్ట్ ప్రకారం సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ఖర్చు కోట్లలో ఉందని సమాచారం. వై ప్లస్ సెక్యూరిటీకి ఏడాదికి దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలుస్తోంది.

ఏప్రిల్‌లో బాంద్రాలోని సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిగింది. అప్పటి నుంచి ఆయన భద్రతను పెంచారు. ఇప్పుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ఇటీవల బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడంతో సల్లూ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా తమ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను ఎవరూ సందర్శించవద్దని సల్మాన్ ఖాన్ కుటుంబం సందేశం పంపిందని కూడా తెలుస్తోంది.