షాకింగ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా అరెస్ట్! కారణమిదే

www.mannamweb.com


బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్ ఆర్‌జే శేఖర్ బాషాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక కేసులో భాగంగా అతనిని అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సుమారు 4 గంటల పాటు శేఖర్ బాషాను విచారిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల యూట్యూబర్ హర్ష సాయి పై ఒక అమ్మాయి పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనపై లైంగికంగా దాడి చేయడంతో పాటు మానసికంగా వేధించాడంటూ ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. హర్షసాయి తనపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2కోట్ల తీసుకొని మోసం చేసినట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసు కేసు నమోదు అయినప్పటి నుంచి హర్ష సాయి కన్పించకుండా పోయాడు. హర్షసాయి విదేశాలకు వెళ్లాడనే తెలియడంతో అతని కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడిదే కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా అరెస్ట్ అయ్యాడు.

హర్షసాయి కేసులో ఆర్జే శేఖర్ బాషా తల దూర్చాడని సమాచారం. పలు యూట్యూబ్ ఛానెల్స్ లో హర్ష సాయికి మద్దతుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే బాధితురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తొంది. కాగా గతంలో రాజ్ తరుణ్, లావణ్య కేసులో కూడా ఇలాగే ఇన్వాల్వ్ అయ్యాడు శేఖర్ బాషా. రాజ్ తరుణ్ కు మద్దతుగా మాట్లాడుతూ లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ కారణంగానే ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో లావణ్య శేఖర్ బాషాను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది.