బాలీవుడ్ బాద్షా.. ఈ పేరును సగటు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘ఇంతింతై’ అన్నట్లు.. షారుఖ్ ఖాన్ భారత ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు.
విదేశాల్లోనూ షారుఖ్‌కు అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం. చిన్న హీరో స్థాయి నుంచి నేడు భారత్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగిన షారుఖ్ జీవితం ఎంతో మందికి ఆదర్శం.
ఇక షారుఖ్ నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమకు షారుఖ్ చేసిన సేవలకు గాను ‘లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్’లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగానే షారుఖ్ పలు ఆసక్తికర విషయాలను పెంచున్నారు. తన చివరి కోరిక అదేనంటూ షారుఖ్ చేసిన వ్యాఖ్యలు.. పై ఆయనకు ఉన్న పిచ్చి ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది.
‘జీవితాంతం మీరు నటుడిగానే కొనసాగుతారా?’ అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు షారుఖ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను చనిపోయే వరకూ ల్లోనే ఉంటానని తేల్చి చెప్పారు. అలాగే.. ఏదైనా సెట్లో యాక్షన్ చెప్పగానే తాను చనిపోవాలని, కట్ చెప్పాక కూడా పైకి లేవకూడదని చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఇదే చివరి కోరిక అంటూ షారుఖ్ మనసులో మాట బయట పెట్టారు.
ఇక స్టార్‌డమ్‌కి ఎలా ఫీలవుతారన్న ప్రశ్నకు బదులిస్తూ.. తాను స్టార్‌డమ్‌ను చాలా గౌరవిస్తానని, దానివల్లే ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బు లభించాయని చెప్పుకొచ్చారు. ఇక తనకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువన్న షారుఖ్. అయితే ప్రస్తుతం ప్రజలు చాలా సున్నితమనసున్నవారయ్యారు. ఏం చెప్పినా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి సెన్సాఫ్ హ్యూమర్ లేకపోవడమే మంచిదంటూ చమత్కరించారు షారుఖ్.