ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో జామకాయ ఒకటి. ఇది రుచిగా ఉండటంతోపాటు.. అనేక సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని పోషకాలు, విటమిన్లు మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి..
అయితే.. జామకాయతోపాటు.. దీని ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైనవి.. జామాకులు పలు సమస్యలను నివారించడంలో సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు… ప్రధానంగా ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను నేరుగా నమలవచ్చు లేదా ఈ ఆకులను ఉపయోగించి తయారుచేసిన డికాక్షన్ ను కూడా తీసుకోవచ్చు. జామ ఆకులు ఎలాంటి వ్యాధులను నియంత్రించడానికి సహాయపడుతాయో తెలుసుకోండి..
రక్తంలో చక్కెర నియంత్రణ: జామ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి.. దీనిలోని పోషకాలు.. చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది. అంతేకాకుండా ఆహారం నుంచి కార్బోహైడ్రేట్ల శోషణను నియంత్రించడంలో సహాయపడుతుంది.
చర్మం – జుట్టు ఆరోగ్యానికి మేలు : జామ ఆకులతో తయారు చేసిన డికాషన్ తాగడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం, జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
గుండె జబ్బులను నివారిస్తుంది: జామాకుల నీరు తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. గుండె జబ్బులను నివారించడంలో కూడా ఇది ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: శరీరంలో రోగనిరోధకశక్తితీ పెంచుకోవాలనుకుంటే మీరు జామాకుల వాటర్ తాగవచ్చు. ఇందులో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలను నయం చేయడానికి: జీర్ణ సమస్యలను నయం చేయడానికి జామాకుల కషాయాన్ని త్రాగవచ్చు. ఇది ఫైబర్ కు మంచి మూలం. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.. ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. దీంతో పాటు మలబద్ధకం, అజీర్తి, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
జామ ఆకుల డికాక్షన్: జామాకుల నీళ్లను తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాసు నీరు.. కొన్ని ఆకులను వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత తాగాలి. (గమనిక: కేవలం అవగాహన కోసం మాత్రమే.. పాటించే ముందు డైటీషియన్లను సంప్రదించండి..)