చలికాలం వేడి నీటితో స్నానం చేస్తున్నారా.? ఈ సమస్యలు తప్పవు..

www.mannamweb.com


చలికాలం వచ్చేస్తోంది. ఇప్పుడిప్పుడే వాతావరణం కూల్‌గా మారుతోంది. మనలో చాలా మందికి వేడి నీటితో స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే చలి కాలంలో మరింత ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తుంటారు.

అయితే ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే కొన్ని సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. ఇంతకీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటితో స్నానం చేస్తే చర్మంపై తేమ తగ్గుతుంది. చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. దీంతో చర్మంపై మచ్చలు, దురదలు, మంటలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే వేడి నీటితో స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి.

* వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు వస్తాయి. దీంతో జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి. జుట్టురాలడానికి ఇది కారణమవుతుంది. వేడి నీటితో స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజింగ్ హెయిర్ కండీషనర్ అప్లై చేయాలి. దీనివల్ల జుట్లు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు.

* బాగా వేడిగా ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు.

* వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఊపిరితుత్తుల్లో వాపు వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఇది దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు.

* ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఆర్థరైటిస్ లేదా కండరాల సంబంధిత సమస్యలు ఉన్న వారిపై మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఇవి పాటించండి..

విపరీతమైన వేడీ నీటితో స్నానం చేయకూడదు. అందుకు బదులుగా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. తల స్నానం చేసేందుకు వేడి నీటిని అస్సలు ఉపయోగించకూడదు. ఒకవేళ చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ను ఉపయోగించుకోవాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.