పిల్లల్ని కనకపోయినా ఫర్వాలేదు.. వాళ్ల ప్లేస్‌లో పందుల్ని పెంచుకోండి అని ఒకప్పుడు చైనా ఇచ్చిన స్లోగన్.
1979లో చైనాలో మోస్ట్ పాప్యులర్ స్లోగన్ ఇది. దాన్నుంచి వచ్చిందే.. One family- One child policy. చైనాలో..
కంటే ఒక్కరినే కనాలి. పొరపాటున ఇంకొకరికి జన్మనిచ్చారా.. ఆ గ్రామంలోని అందరికీ ఆపరేషన్లే. వేసక్టమీ లేదా ట్యూబెక్టమీ.
అంత కఠినంగా వ్యవహరించింది చైనా. కాని, ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటో తెలుసా. ప్లీజ్.. పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, అవసరమైతే లీవ్స్ పెట్టండని అంటోంది.
ఎందుకని ఈ మార్పు..! యువత తగ్గిపోతున్న కారణంగా చైనా జీడీపీ కూడా తగ్గుతోంది కాబట్టి. ఇక జపాన్. అమెరికా తరువాత అత్యంత శక్తివంతమైన దేశం.
ఎకానమీలో అమెరికా తరువాత జపానే. కాని, చేజేతులా ఆ ప్లేస్‌ను చైనాకు ఇచ్చేసింది. 2010 తరువాత ఆ సెకండ్ ప్లేస్‌ను చైనా లాగేసుకుంది. కారణం..
జపాన్‌లో పిల్లల సంఖ్య తగ్గడం. యువత తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరిగినందుకు.. జపాన్ ఆర్థిక వ్యవస్థే కుచించుకుపోయింది. ఇక ఇండియా.
అతి త్వరలోనే జర్మనీని క్రాస్ చేసి జపాన్ ప్లేస్‌లోకి వెళ్లబోతోంది. మూడునాలుగేళ్లలో టాప్-3 ఎకానమీగా ఇండియా ఉండబోతోంది ఇండియా. కారణం.. యూత్ ఎక్కువగా ఉండడం.
యువత లేని దేశాలు ఆర్థికపరంగా ఎలా కిందకు పడిపోతున్నాయో స్వయంగా చూస్తున్నాం. అదే యువత ఉన్న కారణంగా ఆర్థికంగా ఇండియా ఎలా ఎదుగుతోందో కూడా చూస్తున్నాం. కాని, ఇక్కడే ఓ డౌట్ వస్తోంది కొందరికి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా.
కథ రాయాలా.. జస్ట్ నోట్స్ ఇస్తే చాలు వచ్చేస్తుంది. బొమ్మ గీయాలా.. ఎలా కావాలో చెబితే చాలు గీసి ఇచ్చేస్తుంది.
ఇళ్లు కట్టాలా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆల్రడీ వచ్చేసింది. అదే ఇల్లు కట్టించి ఇస్తుంది. ఏం చేయాలన్నా టెక్నాలజీ ఉంది. మరి అలాంటప్పుడు ఇక యూత్‌తో పనేముంది?
ఏం.. యువత తగ్గినంత మాత్రాన చైనా, జపాన్, జర్మనీకి వచ్చిన ఇబ్బందేంటి? ఇప్పటికీ అవి టాప్ పొజిషన్లోనే ఉన్నాయ్ కదా..! వాటికి లేని ఇబ్బంది మనకేంటి?
అని అడుగుతున్నారు. సో, ఇవాళ్టి మన టాపిక్ కూడా యూత్ వర్సెస్ ఓల్డ్ గురించే. మరీ ఓల్డ్ గురించి కాదు గానీ.. మధ్యవయసు దాటాక ఇక వారితో పన్లేదా?
అందరికీ యూత్ మాత్రమే కావాలా? ఒక్క యూత్ కారణంగానే దేశాలు అభివృద్ధి చెందుతాయా? స్టాటిస్టిక్స్ ఏం చెబుతున్నాయో, ఏం కన్‌క్లూజన్ ఇస్తున్నాయో చూద్దాం.. ఇవాళ్టి ఎక్స్‌క్లూజివ్‌లో.