ఆధార్ కార్డులో మార్పులకూ నిబంధనలున్నాయి.. పేరు మార్చుకోవాలంటే అవి మస్ట్

www.mannamweb.com


యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా ఆధార్ కార్డు జారీ అవుతుంది. బయో మెట్రిక్, డెమో గ్రాఫిక్ డేటా ఆధారంగా దాన్ని రూపొందిస్తారు.

ఆధార్ కార్డులో 12 అంకెల నంబర్ కేటాయిస్తారు. అదే మనకు గుర్తింపు గా ఉపయోపడుతుంది. అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు, బతుకుదెరువు కోసం ప్రజలు ఒకచోట నుంచి మరోచోటుకు వలస వెళతారు. అప్పుడు ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు కూడా పలు నిబంధనలు వర్తిస్తాయి. ఆధార్ కార్డులో పేరును మార్పు చేసుకునే అవకాశం ఉంది. అది కూడా కేవలం రెండు సార్లు మాత్రమే చేసుకోవచ్చు.

అసాధారణ సమయంలో ప్రత్యేక అభ్యర్థనపై యూఐడీఏఐ కార్యాలయం తదుపరి మార్పులను అనుమతిస్తుంది. ఆధార్ కార్డులోని పేరులో స్పెల్లింగ్ దోషాలు, క్రమాన్ని మార్చడం, సంక్షిప్త రూపంలోకి మార్చడం, వివాహం తర్వాత పేరు మార్పులు తదితర వాటికి అవకాశం ఉంది. సాాధారణంగా ఆధార్ కార్డులో మార్పులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, లింగం, బయో మెట్రిక్ (వేలి ముద్రలు, ఐరిష్), మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వాటిని మార్చడానికి తప్పకుండా ఆధార్ కేంద్రాలకు వెళ్లాలి. కేవలం చిరునామాను మాత్రం తగిన ధ్రువీకరణ పత్రాలను అప్ లోడ్ చేసి ఆన్ లైన్ లో మార్చుకునే అవకాశం ఉంది.

ఆధార్ కార్డులో పేరు మార్చాలంటే..

సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లండి
యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆధార్ ఎన్ రోల్ మెంట్, అప్ డేట్ ఫారం డౌన్ లోడ్ చేయండి. దానిలో వివరాలు నింపండి
కేంద్రంలో ఆపరేటర్ కు గుర్తింపు పత్రాలు అందించండి
ఆధార్ కార్డులో పేరు మార్పునకు రూ.50 చార్జీ చెల్లించండి.
మీరు యూఆర్ఎన్ (అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్) నంబర్ అందుకుంటారు. దాని ద్వారా యూఐడీఏఐ ఆధార్ స్థితిని తనిఖీ చేయవచ్చు.