వన్‌ప్లస్‌ 13 ఫోన్‌ వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌

OnePlus అభిమానులకు మరో శుభవార్త వచ్చింది. ఈ కంపెనీ తదుపరి ప్రీమియం ఫోన్ సిరీస్ OnePlus 13 లాంచ్ తేదీ ప్రకటించింది. గత కొన్ని వారాలుగా OnePlus 13 గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి.


ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఫోన్ లాంచ్ డేట్ కూడా తెలిసింది. OnePlus 12 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న OnePlus 13 ఈ నెలాఖరున విడుదల కానుంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, OnePlus తన కొత్త ప్రీమియం ఫోన్‌లో Qualcomm అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందించబోతోంది. ఇది కాకుండా, మునుపటి అనేక వన్‌ప్లస్‌ ఫోన్ సిరీస్‌లలో చూసినట్లుగా, ఈ ఫోన్ కెమెరా సెటప్ కూడా Hasselblad ద్వారా తయారు చేసి ఉంటుందని తెలుస్తోంది.

వన్‌ప్లస్ ప్రకారం, వన్‌ప్లస్ 13 మొదట దాని హోమ్ మార్కెట్‌ చైనాలో అక్టోబర్ 31, 2024న విడుదల చేయనుంది. ఆ తర్వాత ఈ ఫోన్ ప్రపంచంలోని ఇతర దేశాల్లో, భారతదేశంలో కూడా ప్రారంభించనుంది. ఈ ఫోన్ టీజర్ కూడా రివీల్ చేసింది. ఇందులో దాని మూడు కలర్ వేరియంట్‌లను చూడవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ను అబ్సిడియన్ బ్లాక్, బ్లూ మూమెంట్, వైట్ డ్యూ కలర్ ఆప్షన్‌లలో విడుదల చేయబోతోంది.

OnePlus 13 స్పెక్స్:

చైనాలో OnePlus 13 లాంచ్ టీజర్ కూడా విడుదలైంది. దీని ప్రకారం ఫోన్ లాంచ్ కార్యక్రమం అక్టోబర్ 31 న చైనా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి మాట్లాడితే.. ఇప్పటివరకు లీక్ అయిన రిపోర్ట్‌ల ప్రకారం, ఇది ప్రపంచంలోనే మొదటి సెకండ్-జెన్ 2K BOE X2 కర్వ్‌డ్ డిస్‌ప్లేని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది కాకుండా, Snapdragon 8 Elite (8 Gen 4) ఫోన్‌కు అద్భుతమైన ప్రాసెసర్‌ను అందించడానికి ఉపయోగించవచ్చు.

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సెటప్ ప్రధాన కెమెరా 50MP LYT808 సెన్సార్ కావచ్చు, రెండవది 50MP JN5 సెన్సార్ కావచ్చు. మూడవది పెరిస్కోప్ సెన్సార్ కావచ్చు. అయితే, దీనికి సంబంధించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ లీకులు, టెక్‌ నిపుణుల నుంచి వివరాలు బయటకు వచ్చాయి.

6000mAh జంబో బ్యాటరీ

ఈ మొబైల్‌కు 6000 mAh జంబో బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది IP68/IP69 రేటింగ్‌ను కూడా పొందవచ్చు. ఇది ఫోన్‌ను నీరు, ధూళి సమస్యల నుండి పూర్తిగా సురక్షితంగా ఉంటుందని తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.