బంగారానికి బాబులా వెండి ధర.. కిలో రూ.1 లక్ష+.. కొంటే మంచిదేనా?

www.mannamweb.com


మొన్న బంగారం పది గ్రాములు లక్ష రూపాయిలు అవుతుందా అన్న ప్రశ్న ఎదురైంది. మొత్తానికి 10 గ్రాముల పుత్తడి ధర 80 వేలు దాటి రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష రేసులో గోల్డ్ కన్నా ముందు వెండి దూసుకొచ్చింది.

ఇప్పుడు కేజీ వెండి ధర అక్షరాలా లక్షా 10 వేల రూపాయిలు. తొలిసారిగా ఇది లక్ష మార్క్ ను దాటింది. కేజీ వెండి లక్ష దాటిందా అంటూ చాలామంది నోరెళ్లబెట్టవచ్చు. కానీ ఇది నిజం.

నిజానికి నిత్య వాడుకలో బంగారానికి ఉన్నంత డిమాండ్ వెండికి ఉండదు. పూజా సామగ్రి, భోజన సామగ్రి.. ఇంకా కొన్ని వస్తువుల కోసం ఎక్కువగా వెండిని ఉపయోగిస్తారు. ఈమధ్యకాలంలో సిల్వర్ జువెలరీ బాగా పాపులర్ అవుతోంది.

కొన్నిచోట్ల వెండి ఆభరణాలకు గోల్డ్ కోటింగ్ కొట్టి విక్రయిస్తున్నారు. పైగా వీటి ధర కూడా తక్కువగా ఉండడంతో చాలామంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. మరి వీటన్నింటివల్లా వెండి ధర పెరుగుతోందా అంటే.. అవును అని చెప్పలేం. నిజానికి వెండి వాడకం పారిశ్రామికంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికి ఇంత రేటు అంటున్నాయి వ్యాపార వర్గాలు.