స్మార్ట్‌ఫోన్ పేలుళ్లకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా?

www.mannamweb.com


నేడు దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. పలు చోట్ల స్మార్ట్‌ఫోన్‌లు పేలినట్లు అనేక వస్తున్నాయి. ఫోన్ పేలుడుకు అసలు కారణం మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

స్మార్ట్‌ ఫోన్‌ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. అయితే ఈ ఫోన్లు వాడే విధానంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పొరపాట్ల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? స్మార్ట్‌ఫోన్‌లు పేలడానికి కారణమయ్యే తప్పుల గురించి తెలుసుకుందాం.

మొబైల్ ఛార్జింగ్ కోసం ఎల్లప్పుడూ మంచి కంపెనీ ఛార్జర్‌ని ఉపయోగించండి. మార్కెట్‌లో దొరికే ఏదైనా ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేస్తే, అది పేలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే కంపెనీ తయారు చేసిన ఛార్జర్ మాత్రమే మీ ఫోన్‌ను ఛార్జ్ చేయగలదు.
ఫోన్‌ను ఓవర్‌ఛార్జ్ చేయడం కూడా పొరపాటే. అలాగే ఫోన్‌ వేడెక్కడం వల్ల కూడా సమస్యే. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు చాలా మంది ఫోన్‌ను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఫోన్‌ ఉపయోగించడం పెద్ద తప్పు. ఎందుకంటే ఇది ఫోన్‌ను వేడెక్కేలా చేస్తుంది. పేలుడు ప్రమాదాన్ని పెంచుతుంది.
అదనంగా మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు గేమ్‌లు ఆడకుండా ఉండండి. ఇది ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపుతుంది.
అధిక ఉష్ణోగ్రతలు మీ ఫోన్‌కు ప్రమాదకరం. వేసవిలో ఫోన్ పేలుళ్లకు సంబంధించిన కారణాలు ఉన్నాయి. విపరీతమైన వేడి సమయంలో మీ ఫోన్‌ను మీ కారులో ఉంచవద్దు. మీ ఫోన్‌లో బ్యాటరీ బలహీనంగా ఉంటే, అది పేలుడు లేదా అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తుంది.
ఫోన్‌లు పేలడానికి ఒక కారణం ఏమిటంటే, చాలా మంది ఫోన్ వెనుక కవర్‌పై నోట్స్ లేదా పేపర్‌లను ఉంచడం. ఇది ఫోన్ ద్వారా గాలిని నిరోధిస్తుంది. దీని వలన ఫోన్ త్వరగా వేడెక్కడం ప్రారంభమవుతుంది. చాలా సార్లు ఫోన్ కవర్‌పై పేపర్ లేదా నోట్స్ ఉంచడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి.