యాదాద్రి భక్తులకు అలర్ట్.. ఇకపై ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషేధం

www.mannamweb.com


తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది ఈ యాదగిరి గుట్ట..

యదాద్రిగా పిలవబడుతోంది. అయితే ఇకపై యాదగిరిగుట్ట పైన ఫొటోలు, వీడియోలు నిషేధం విధిస్తున్నట్లు ఆలయ ఈఓ భాస్కర్ రావు ప్రకటించారు. స్వామీ వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రతిష్టకు… వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేదిస్తున్నామని వెల్లడించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు మాఢవీధుల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగి జ్ఞాపకంగా భద్రపరుచుకుంటే అభ్యంతరం లేదన్నారు. అయితే వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకునే చర్యలతో ఆలయ ప్రతిష్టకు భంగం కలుగ డంతోపాటు భక్తుల మనోభావాలు, విశ్వాసానికి ఆటంకం ఏర్పడుతుందని ఆయన అన్నారు.

ఇలాంటి చర్యలపై దేవస్థాన సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు ఆలయ ఈవో భాస్కర్ రావు. ఇక నుంచి కొండపైన భక్తులు తీసే ఫొటోలు, వీడియోలపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని స్పష్టం చేశారు. దేవాలయ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.