వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ, రాజకీయాలంటే వ్యాపారం కాదంటూ జగన్‌పై తీవ్ర ఆరోపణలు

www.mannamweb.com


వైసీపీ నాయకురాలు, మాజీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్మి పద్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. జగ్గయ్యపేట నియోజక వర్గ బాధ్యతలు అప్పగించకపోవడంపై కినుక వహించిన వాసిరెడ్డి పద్మ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు
వైఎస్సార్సీపీ రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ

ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వైయస్ఆర్ సీపీకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ ‘గుడ్ బుక్’ , ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “ గుండె బుక్ ” అని వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదని పేర్కొన్నారు. జీవితాలు , ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు.

పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని పరిపాలన చేయడంలో బాధ్యత లేదని సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని మండిపడ్డారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని లేఖలో పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశానని చెప్పారు. ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది YCPను వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన వాసిరెడ్డి పద్మ గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా వెలుగులోకి వచ్చారు. వైఎస్సార్పీపీ స్థాపించిన తర్వాత ఆ పార్టీ మహిళా నాయకురాలిగా ఎదిగారు. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని భావించినా సాధ్యపడలేదు. జగ్గయ్యపేటలో పోటీ చేసిన సామినేని ఉదయభాను ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనలో చేరిపోయారు. నియోజక వర్గం బాధ్యతలు ఆశించిన వాసిరెడ్డి పద్మకు నిరాశ తప్ప లేదు. జగ్గయ్యపేట బాధ్యతలు తన్నీరు నాగేశ్వరరావుకు అప్పగించడంపై ఆమె కినుక వహించినట్టు తెలుస్తోంది.