ఇంటి బాల్కనీలో ఈ నాలుగు మొక్కలు కచ్చితంగా ఉండేలా చూసుకోండి, డెంగ్యూ దోమలు రావు

www.mannamweb.com


కొన్ని రకాల మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రావు. కొన్ని మొక్కలు డెంగ్యూను, మలేరియాను తెచ్చే దోమలను దూరంగా ఉంచుతాయి. ఈ మొక్కలు కచ్చితంగా బాల్కనీలో ఉండేట్టు చూసుకోండి.

ఈ రోజుల్లో దోమల బెడద ఎక్కువగానే ఉంది. దోమల వల్ల రోజురోజుకూ డెంగీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా దోమలు రావడం ఆగడం లేదు. దోమలను తొలగించడానికి కాయిల్స్, దోమ వికర్షక క్రీమ్ వంటి అనేక ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి. వాటి నుంచి భద్రత కావాలంటే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి.

ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం, కిటికీలు, తలుపులను మూసి ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇంటి బాల్కనీలో కొన్ని ప్రత్యేక మొక్కలను పెంచడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి. కొన్ని మొక్కల వాసన దోమలకు నచ్చదు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలకు కారణమయ్యే దోమలను దూరంగా ఉంచాలంటే పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే.
లెమన్ గ్రాస్ ప్లాంట్

సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన లెమన్ గ్రాస్ మీ ఇంటి నుండి దోమలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిని అనేక సహజ దోమల నివారిణి ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. వాస్తవానికి నిమ్మగడ్డి వాసన మీ మూడ్ ను రిఫ్రెష్ అవుతుంది. నిమ్మగడ్డి ఉన్నచోట దోమలు ఉండవు. దోమలకు వాటి వాసన ఇష్టం ఉండదు. అవి లెమన్ గ్రాస్ నుండి పారిపోతాయి. అందుకే ఇది మీ బాల్కనీకి మంచి మొక్క కావచ్చు.
బంతిపువ్వు మొక్క

బంతిపువ్వుల సీజన్ ఇది. ఒక మొక్క తెస్తే చాలు బంతిపువ్వులు విపరీతంగా పూస్తాయి. బాల్కనీ అందాన్ని పెంచే బంతిపువ్వులు మొక్కను కొని ఇంటికి తెచ్చుకుంది. బంతిపూల మొక్కల నుంచి వచ్చే వాసన దోమలకు నచ్చదు. నిజానికి బంతిపూల మొక్క వాసన దోమలకు అలెర్జీలా ఉంటుంది. కేవలం దోమలే కాదు అనేక చిన్న చిన్న కీటకాలు కూడా మీ ఇంటి చుట్టూ రావు. బంతి మొక్కను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అన్ని రకాలు ఉపయోగాలు ఉంటాయి. ఆ పువ్వులను దేవునికి సమర్పించవచ్చు.

లావెండర్ మొక్క

లావెండర్ మొక్క మెదడును రిఫ్రెష్ చేసే వాసనను విడుదల చేస్తుంది. లావెండర్ వాసన దోమలకు నచ్చదు. అవి ఆ గాలిని పీల్చడానికి ఇష్టపడవు. దీనిని అనేక దోమల నివారిణి ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో, మీరు మీ బాల్కనీలో లావెండర్ మొక్కను పెంచవచ్చు. లావెండర్ మొక్కలు మీ బాల్కనీలో ఉంచడం వల్ల దోమలకు చికాకుగా అనిపిస్తుంది. డెంగ్యూ, మలేరియా వ్యాధులు రాకుండా ఉండాలంటే లావెండర్ మొక్కలు కొని ఇంట్లో పెట్టుకోండి.
పుదీనా మొక్క

పుదీనా మొక్కలు ఆహారానికి మంచి రుచిని అందిస్తాయి. మీరు దాని రుచికరమైన చట్నీని ఆస్వాదించి ఉంటారు. మీరు దాని తాజా సువాసనను కూడా గుర్తించే ఉంటారు. పుదీనా మొక్కలను కచ్చితంగా మీ బాల్కనీలో ఉండేలా చూసుకోండి. ఇవి మీకు రుచికరమైన ఆహారాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మీరు ప్రతిరోజూ రుచికరమైన పచ్చడి తినడం వల్ల దోమలు మీకు దూరంగా ఉంటాయి. పుదీనా వాసన దోమలకు నచ్చదు. మీ నుంచి కానీ, మీ ఇంట్లోని కానీ పుదీనా వాసన వస్తే దోమలు అక్కడ ఉండేందుకు ఇష్టపడవు. కాబట్టి చిన్న కుండీల్లో పుదీనా మొక్కలు అధికంగా పెంచడం అలవాటు చేసుకోండి.