శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే బెస్ట్ ఫుడ్స్.. మిస్ చేయకండి

www.mannamweb.com


ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. ఆరోగ్యంగా, బలంగా, దృఢంగా ఉండాలంటే పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకోవాలి. అందులోనూ ప్రస్తుతం వింటర్ సీజన్ ప్రారంభమైంది.

ఈ సమయంలో రోగాలు ఎటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉండాలి. ఇమ్యూనిటీ వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. అనారోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. వచ్చినా వాటితో పోరాడే శక్తి ఉండాలి. దీని వల్ల ఎక్కువగా బాడీ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి? ఇమ్యునిటీ వ్యవస్థను బల పరిచే ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయలు:

నిమ్మ రసం, నిమ్మకాయ పచ్చడి వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తాయి. త్వరగా ఎలాంటి సమస్యలు ఎటాక్ కాకుండా ఉంటాయి.

బాదం:

ప్రతి రోజూ నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల కూడా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. బాదం పప్పులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణగా ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండండి.

పెరుగు – పాలు:

పెరుగు, పాలు తీసుకోవడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పెరుగులో ముఖ్యంగా యాంటీ బయోటిక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు, చెడు బ్యాక్టిరియాను బయటకు పంపిస్తాయి. పాలు తాగడం వల్ల నీరసం, అలసట అనేది తగ్గి.. తక్షణమే శక్తి వస్తుంది.

పసుపు:

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మందికి తెలిసిన విషయమే. పసుపు తరచూ మీ వంటల్లో ఉపయోగించడం వల్ల.. శరీరం త్వరగా ఇన్ఫెక్షన్లకు గురి కాకుండా ఉంటుంది.

తేనె:

పోషకాలు నిండిన పదార్థాల్లో తేనె కూడా ఒకటి. తేనె తరచూ ఒక స్పూన్ తీసుకున్నా.. రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఉత్సాహంగా ఉంటారు.

పండ్లు – కూరగాయలు:

తరచూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవడం వల్ల కూడా శరీరంలో ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. దీంత త్వరగా జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)