ఏపీకి మరో గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. అమరావతి రైల్వే లైన్‌కు కేబినెట్ ఆమోదం

www.mannamweb.com


అమరావతి 2.O వర్షన్‌ నడుస్తోందిప్పుడు. రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయినిపాలెం వద్ద 160 కోట్ల రూపాయలతో సీఆర్‌డీఏ కోసం జీ+7 బిల్డింగ్‌ పనులను 2017లో ప్రారంభించారు.

దాదాపు ఏడేళ్ల గ్యాప్ తరువాత ఆ ప్రాజెక్ట్ పనులను మళ్లీ ప్రారంభించారు. ఈసారి పనులు ఆగడం కాదు.. టార్గెట్‌ లోపు పూర్తిచేయాలనే టార్గెట్ కూడా పెట్టారు.

ఈ క్రమంలోనే అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రగతికి రైల్వే ద్వారా పనుల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం అమరావతికి వెళ్లే రైలు మార్గాన్ని రూపొందించేందుకు భారతీయ రైల్వే సంస్థ వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య ప్రాంతాలలో రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించాలని ఇప్పటికే రైల్వే శాఖ కార్యాచరణ మొదలు పెట్టింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని 97 గ్రామాలలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వటంతో భూసేకరణలో వేగం పుంజుకోనుంది. కొత్త రైల్వే లైన్ ద్వారా ప్రజలు ఆంధ్రప్రదేశ్‌లోని రాజధాని నగరం అమరావతికి సులభంగా ప్రయాణించేందుకు వీలవుతుంది.

కొత్త రైల్వే లైన్ay భాగంగా కృష్ణా నదిపై కృష్ణా నదిపై 3.233 కి.మీ పొడవైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ కారణంగా అమరావతికి చెన్నై, కొలకత్తా, హైదరాబాద్, ఢిల్లీ నగరాలతో అనుసంధానం చేయనున్నారు. గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఖమ్మం జిల్లాల మీదుగా కొత్త రైలు మార్గాన్ని నిర్మించేందుకు దాదాపు 450 హెక్టార్ల భూమిని వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించటం కోసం దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని రైల్వే శాఖ ఇది వరకే అంచనా వేసింది. ఈ కొత్త రైల్వే లైన్ లో మొత్తం తొమ్మిది స్టేషన్లు ఉండనున్నాయి. పెద్దాపురం, చిన్నరావులపాలెం, గొట్టిముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావురు స్టేషన్లు ఈ రైల్వే లైన్ లో ఉంటాయి. వీటిలో అమరావతిని ప్రధాన స్టేషన్‌గా అభివృద్ధి చేయటానికి రైల్వే నిర్ణయం తీసుకుంది. 2029 నాటికి అమరావతి నగరాన్ని AI నగరంగా సుందరంగా తీర్చిదిద్దాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారు. వచ్చే మూడేళ్లలో అమరావతికి రైల్వే ట్రాక్ పూర్తి చేసేందుకు రైలు శాఖ కసరత్తు చేస్తోంది.