ఫేమస్ లాప్ టాప్ కంపెనీ HP ఇండియాలో తన ఫస్ట్ 2 ఇన్ 1 ఏఐ ల్యాప్ టాప్ ని లాంచ్ చేసింది. ఈ సరికొత్త ల్యాప్ పేరు ‘ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్’. ఇది హెచ్ పీ నుంచి వస్తున్న ఫస్ట్ Artificial intelligence ల్యాప్ టాప్. ఈ ల్యాప్ టాప్ ఫీచర్ల గురించి తెలిస్తే కచ్చితంగా అదిరిపోయాయని అంటారు. ఇక ఈ ల్యాప్ టాప్ ఫీచర్లు ఏంటి? దీని ధర ఎంత ? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ల్యాప్ టాప్ లో ఇంటెల్ లూనార్ లేక్ ప్రాసెసర్స్, సెకనుకు 48 ట్రిలియన్ పనులను చేయగల న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ లో క్వాలిటీ వీడియోలను ఆస్వాదించవచ్చు. ఈ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ అయితే సూపర్ అనే చెప్పాలి.ఇది ఒక్క చార్జ్ కు ఏకంగా 21 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఇందులో 2.8K ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. ఇంకా దీనిని మనం కేవలం ల్యాప్‌టాప్‌గానే కాకుండా టాబ్లెట్ లాగా కూడా వాడుకోవచ్చు.
ఈ ల్యాప్ టాప్ లో HP వోల్ఫ్ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ సైబర్ అటాక్ నుండి ల్యాప్ టాప్ ని అందులో ఉండే మన డేటాను కాపాడుతుంది. అలాగే.. డీప్‌ఫేక్ డిటెక్టర్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. ఈ ఫీచర్లు మన డేటాను సేఫ్ గా ఉంచుతాయి. ల్యాప్ టాప్ ని ఎవరు హ్యాక్ చేయకుండా ఈ ఫీచర్స్ ఉపయోగపడతాయి. ఈ ఓమ్నిబుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్ టాప్ ఫ్రీలాన్సర్ లు, కంటెంట్ క్రియేటర్లకు ఇంకా ఏ జాబ్ చేసే వారికైనా చాలా బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఈ ల్యాప్ టాప్ లో 9 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, పాలీ ఆడియో ఉన్నాయి. అలాగే స్పాట్ర లైట్, బ్యాక్ గ్రౌండ్ బ్లర్ వంటి AI పాలీ కెమెరా ప్రో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ AI కంపానియన్ కంటెంట్ ఎనాలసిస్, PC ఆప్టిమైజేషన్ కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో క్రియేటివ్ వర్క్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కోపైలట్ + పీసీతో ఇంటిగ్రేట్ అవుతుంది.
ఈ ల్యాప్ టాప్ లో 32 జీబీ ర్యామ్ ఉంటుంది, 64 వాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ వైఫై, బ్లూటూత్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో రెండు వేరియనట్లు ఉంటాయి. HP ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్ట్స్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 7 రూ.1,81,999 ఉంటుంది. ఇక HP ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 అయితే రూ.1,91,999 ఉంటుంది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌ను అక్టోబర్ 31వ తేదీ లోపు కొంటే రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్స్ ఫ్రీగా వస్తాయి. దీన్ని బజాజ్ ఫైనాన్స్‌తో నో కాస్ట్ ఈఎమ్ఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.