వేల కోట్ల భారం మోస్తున్న డైరెక్టర్స్.. TFIలో సునామి గ్యారెంటీ

www.mannamweb.com


మా హీరో పాన్ ఇండియా స్టార్ , మా హీరో గ్లోబల్ స్టార్.. బడా దర్శకుడు లేకపోయినా మా హీరోకు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. నిజమే అభిమానులు చెప్పినట్లుగా హీరోలంతా అదే రేంజ్ లో ఉన్నారు. టాలీవుడ్ హీరోలు, సౌత్ ఇండియన్ హీరోలు ఎవరు లేరు. అందరు పాన్ ఇండియ హీరోలే ఉన్నారు. సినిమాల మార్కెట్ హీరోల ఇమేజ్ ను బట్టి ఉంటుందనేది వాస్తవం. కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అలా లేదు. వీరంతా పాన్ ఇండియా లెవెల్ లో హిట్స్ కొట్టడం వెనుక డైరెక్టర్స్ పాత్ర చాలా ఉంటుంది. ఒకసారి కోట్లలో వసూళ్లు వచ్చాయంటే.. ఇక తర్వాత సినిమా మీద కూడా అదే అంచనాలు కొనసాగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ , చరణ్, బన్నీ ముందు వేల కోట్ల టార్గెట్స్ ఉన్నాయి. అయితే వీరిపై ఎంత భారం ఉందో.. అంతకుమించిన భారం ఇప్పుడు దర్శకుల మీద పడుతుంది.

పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నారు దర్శకులు. ఒకరికి మించి ఒకరు బడ్జెట్ ను పెంచేస్తున్నారు. మరి అంత బడ్జెట్ కేటాయించినప్పుడు.. ఆ రేంజ్ వసూళ్లను సాధించాల్సిన బాధ్యత కూడా వారి మీదే ఉంది. అలా వేల కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్నారు తెలుగు డైరెక్టర్స్ . తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సునామి సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అసలు భారీ బడ్జెట్ సినిమా అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది రాజమౌళి. బాహుబలితో రికార్డ్స్ బ్రేక్ చేసి.. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకుని.. ఇప్పుడు ఒక్కో సినిమాకు మెరుగులు దిద్దుతూ.. బడ్జెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. అలా ఇప్పుడు మహేష్ తో ఓ ప్రాజెక్ట్ కు ఏకంగా 2000 కోట్ల భారీ బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. సో దానికి తగినట్లు రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనే మీదే ఉంది. ఇక ఆ తర్వాత ఇదే రేంజ్ లో భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. అది కాకుండా ఈ దర్శకుడి చేతిలో ప్రభాస్ సలార్ 2 సినిమా బాధ్యత కూడా ఉంది. ఈ రెండు దాదాపు 1000 కోట్ల మార్కెట్ ఉన్న ప్రాజెక్ట్స్. కాబట్టి ప్రశాంత్ నీల్ కూడా ఈ భారం మోస్తున్నట్లే.

ఇక ఈ రెండు సినిమాల అంత కాకపోయినా.. ప్రస్తుతం లెక్కల మాస్టారు సుకుమార్ కూడా వేల కోట్ల భారాన్ని మోస్తున్నాడు. రిలీజ్ కు చాలా దగ్గరిలో ఉన్న మూవీ పుష్ప 2. ప్రస్తుతం ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. కనీసం 1200 నుంచి 1300 కోట్ల టార్గెట్ సుకుమార్ కళ్ళ ముందు ఉంది. ఇక వీరు కాకుండా సందీప్ రెడ్డి వంగ , ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే సౌత్ లో ఇంతమంది పేర్లు మోత మోగిపోతుంటే.. నార్త్ లో మాత్రం కేవలం అయాన్ ముఖర్జీ పేరు మాత్రమే వినిపిస్తుంది. వారి ఆశలన్నీ కూడా ఈ దర్శకుడిపైనే ఉన్నాయి. ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. బాలీవుడ్ కాస్త నిలదొక్కుకోవాలంటే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను దాటాల్సిందే. ఏమౌతుందో చూడాలి.