ఈ పద్దతులు ఫాలో చేస్తే.. హాయిగా నిద్ర పడుతుంది.

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడి, ఆందోళన అనేవి ఎక్కువై నిద్ర మీద ఎఫెక్ట్ పడుతున్నాయి. సరిగా నిద్రపోకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరి గాఢ నిద్రలోకి చేరుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం

చక్కగా నిద్ర పట్టాలంటే ముందుగా భోజనం అనేది త్వరగా ముగించాలి. చాలా మంది పడుకునే ముందు తింటారు. దీని వలన జీర్ణ సమస్యలు వచ్చి సరిగా నిద్ర పట్టదు. కాబట్టి పడుకోవడానికి రెండు గంటల ముందే డిన్నర్ కంప్లీట్ చేయాలి. చాలా తేలికగా జీర్ణం అయ్యే పదార్థాలు తీసుకోవాలి.

పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. కాబట్టి త్వరగా నిద్ర అనేది పడుతుంది. ఒత్తిడి, ఆందోళన అనేవి దూరం అవుతుంది.

ఎంత సేపు అయినా మీకు నిద్ర రాక ఇబ్బంది పడుతూ ఉంటే.. కాసేపు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల గాఢ నిద్రలోకి చేరుకుంటారు. అదే విధంగా మీరు నిద్రించే గదిలో వెలుతురు ఎక్కువగా లేకుండా చూసుకోండి.

గాఢ నిద్రలోకి చేరుకోవాలంటే.. పాలు కూడా హెల్ప్ చేస్తాయి. పడుకునే ముందు గోరు వెచ్చటి పాలను తాగండి. పాలు నిద్రలోకి జారుకునేలా చేస్తాయి. ఏదన్నా బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల కూడా నిద్రలోకి జారుకుంటారు.