చాలా మంది భోజనంలో ఇష్టం తినే పదార్ధాల్లో అప్పడాలు ముఖ్యమైనవి. ఇవి భోజనం రుచిని పెంచడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా వీటిని తినాలని చెబుతున్నారు..
భోజనంలో ఊరగాయ పచ్చడి ఎంత ఇంపార్టెంటో.. కొందరికి అప్పడం కూడా చాలా ముఖ్యం. అప్పడాలు లేకుండా ముద్దదిగదు మరి. నిజానికి, అందరూ దీన్ని ఇష్టపడి తింటారు. అయితే అప్పడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
అవును.. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అప్పడంలో శరీరానికి శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అప్పడంలో ప్రొటీన్లు, కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇందులో చాలా ఫైబర్ ఉంటుంది. దీనిని భోజనంతో పాటు తినడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది పూర్తిగా గ్లూటెన్ ఫ్రీ. అప్పడంలో కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అప్పడంలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు అప్పడాలను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వైద్యుల సలహా మేరకు మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీసుకోవచ్చు.
అప్పడంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కంటి సంబంధిత ఆరోగ్య రుగ్మతలు, చెవి సంబంధిత వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అప్పడాలను రెగ్యులర్ గా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు. ఆకలిగా అనిపించదు. అలాంటప్పుడు వేయించిన అప్పడం తింటే ఆకలి పెరుగుతుంది. తినాలనే కోరిక పెరుగుతుంది. కాబట్టి వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.