రేపు ఏపీ టెట్ ఫైనల్ కీలు విడుదల – నవంబర్ 2న ఫలితాలు

www.mannamweb.com


ఏపీ టెట్ ఫలితాల విడుదలకు కసరత్తు జరుగుతోంది. రేపు అన్ని పరీక్షల ఫైనల్ కీలు అందుబాటులోకి రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://aptet.apcfss.in/ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2న ఫలితాలు రానున్నాయి.

ఏపీ టెట్ పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే అన్ని పరీక్షల ప్రాథమిక కీలను కూడా విడుదల చేసింది. వీటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. అయితే తుది కీ లను రేపు(అక్టోబర్ 27) విడుదల చేయనుంది.పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://aptet.apcfss.in/ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

నవంబర్ 2న టెట్ ఫలితాలు..!

ఏపీ టెట్ తుది ఫలితాలను నవంబర్ 2న ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తి కావటంతో ఈనెల 27న ఫైనల్ కీలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే తుది ఫలితాలను ప్రకటిస్తారు. టెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫైనల్ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
ఏపీ టెట్ కీలను ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
హోం పేజీలోని ‘Question Papers & Keys’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
మీ పరీక్ష తేదీ అనుగుణంగా ప్రాథమిక కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.
టెట్ ఎగ్జామ్ పేపర్, ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.
భవిష్యత్ అవసరాల కోసం ఆన్సర్ కీ హార్డ్ కాపీని తీసుకోండి.

ఏపీలో అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’ లు వెబ్ సైట్ లో ఉంచారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్:

ఇక ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబరు మొదటి వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 3వ తేదీన నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావించారు. ఆ రోజు ఆదివారం కావడంతో ముఖ్యమైన నాయకులు అందుబాటులో ఉంటారో లేదోననే సందేహంతో మరో తేదీలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు.

టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థుగా భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్‌లోనే డీఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.