బయట ఫుడ్ తినే ముందు ఇవి గుర్తుంచుకోండి

www.mannamweb.com


షవర్మ తిన్నారో చచ్చారే.. ఓ హోటల్ లో షవర్మ తిని 17 మంది అస్వస్థత. షవర్మ తింటే చావేనా దిక్కు? అంటూ మొన్నటివరకు దీని గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి. స్ట్రీట్ ఫుడ్ విషయంలో అపప్రమత్తంగా ఉండాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తునే వస్తున్నారు. అయినా సరే ప్రజలు ఏ మాత్రం భయపడడం లేదు. తింటే ఏమైందిలే అనుకుంటున్నారో.. లేదా చెప్పేవాళ్ళు అలానే చెప్తారనుకుంటున్నారో.. తెలియదు కానీ స్ట్రీట్ ఫుడ్స్ తినే విషయంలో మాత్రం అసలు తగ్గడం లేదు. ఆ షవర్మ ఘటన మరువక ముందే.. రీసెంట్ గా.. ‘ప్రాణం తీసిన మోమోస్, మోమోస్ తిని మహిళ మృతి.. మరో యాభై మందికి అస్వస్థత’ అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తకు ప్రజలు కాస్త జంకారు. ఏకంగా యాభై మందికి పైగా ఆసుపత్రి పాలైన ఘటన అందరిలో కలకలం రేపింది.

షవర్మ, మోమోస్ మాత్రమే కాదు.. గతంలో పానీ పూరి తిని కూడా ఎంతో మంది అస్వస్థకు గురైన ఘటనలు ఎన్నో చూశాము. ఇలాంటి ఘటనలు జరిగిన కొన్ని రోజులు మాత్రమే భయంగా ఉంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత యధావిధిగా స్ట్రీట్ ఫుడ్స్ ను లాగించేస్తూ ఉంటారు ప్రజలు. తరచూ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో ఇలా జరగడంతో.. ప్రజలంతా ఈ విషయంలో అపప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మోమోస్, షవర్మాస్ తయారు చేసిన మూడు గంటల లోపే తినాలని అంటున్నారు. ఒకవేళ మూడు గంటల తర్వాత తింటే మాత్రం ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సాధ్యమైనంత వరకు స్ట్రీట్ ఫుడ్స్ ను మానేయడం మంచిదని హెచ్చరిస్తున్నారు. తరచూ ఇలా జరుగుతూనే ఉన్నాయ్ కాబట్టి.. స్ట్రీట్ ఫుడ్స్ వెండర్స్ పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారని తెలియజేశారు. ప్రస్తుతం దీపావళి కి భారీ మొత్తంలో స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు.. కాబట్టి స్వీట్స్ షాప్స్ లో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు.

అయితే ఇలా అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ.. ఇంకా చాలా చోట్ల కల్తీలు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రజలు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా.. స్ట్రీట్ ఫుడ్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు. చిన్న పిల్లలు మొదలు పెద్ద వారు వరకు ఎవరూ కూడా కనీసం ఆలోచించడం లేదు. పైగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఫుడ్ కు సంబంధించిన వీడియోస్ ఏ ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నాయి. దీనితో వాటి పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఇలా ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా.. తినే వారు మాత్రం తినకుండా ఆగడం లేదు. కాబట్టి ఏ ఆహార పదార్ధాలనైనా సరే వండిన మూడు నుంచి నాలుగు గంటల లోపు తినడం మంచిదని. ఇలా స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో మరింత అపప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.