నగరాల్లో పార్టీ కల్చర్.. రేవ్ పార్టీకి.. మందు పార్టీకి తేడాలు ఏంటో తెలుసా?

www.mannamweb.com


ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ పెరిగిపోతున్నది. వీకెండ్ లో పబ్బుల్లో చేరి ఎంజాయ్ చేస్తున్నారు. పాశ్చత్య దేశాల సంస్కృతి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సెలబ్రిటీలు, డబ్బున్న వ్యక్తులు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడి కల్చర్ కు అలవాటుపడి స్వదేశానికి వచ్చిన తర్వాత అదే కల్చర్ ను ఇక్కడ కొనసాగించేందుకు అలవాటు పడుతున్నారు. దీనిలో భాగంగా వచ్చిందే రేవ్ పార్టీ. రేవ్ పార్టీలకు బానిసలుగా మారుతున్నారు. సందర్భం ఏదైనా ఎంజాయ్ చేసేందుకు యువతతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రేవ్ పార్టీ.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. పోలీసుల రైడ్ తో రేవ్ పార్టీల ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు రేవ్ పార్టీలో పట్టుబడుతుండడంతో తీవ్ర కలకలంరేపుతోంది.

ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడి బంధువుకు చెందిన ఫాం హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీ రాష్ట్రంలో అలజడి సృష్టించింది. రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేయడంతో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఫాం హౌస్ లో విదేశీ మద్యం బాటిళ్లు, క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాయి. డ్రగ్స్ పార్టీ జరిగిందనే సమాచారంతో టెస్ట్ నిర్వహించగా పార్టీలో పాల్గొన్న వారు అందుకు సహకరించలేదు. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనతో అసలు రేవ్ పార్టీ అంటే ఏంటీ? రేవ్ పార్టీలో ఏం చేస్తారు? అనే విషయాలు తెలుసుకునేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇదే సమయంలో మందు పార్టీ అంటే ఏంటీ అని ఆరా తీస్తున్నారు. మరి రేవ్ పార్టీకి, మందు పార్టీకి తేడాలేంటీ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రేవ్ పార్టీ ఎప్పుడు మొదలైందంటే.. రేవ్ పార్టీ కల్చర్ ఇంగ్లండ్ దేశంలో 1950లో మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ వైడ్ గా ఈ కల్చర్ విస్తరించింది. ఓ క్లోజ్డ్ ప్రదేశంలో మద్యం సేవిస్తూ పార్టీలు చేసుకుంటుంటారు. బడాబాబుల ఫాం హౌస్ లలో లేదా గెస్ట్ హౌస్ లలో రేవ్ పార్టీలను నిర్వహిస్తుంటారు. అసలు మొదట్లో రేవ్ పార్టీలో మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేసేవారు. రేవ్ పార్టీలో ఒళ్లు మరిచి ఎంజాయ్ చేస్తుంటారు. మద్యం సేవిస్తూ.. డ్రగ్స్ తీసుకుంటూ అశ్లీల నృత్యాలతో నానా రచ్చ చేస్తుంటారు. రాను రాను రేవ్ పార్టీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలను రహస్యంగా వాడడం మొదలైంది. రేవ్ పార్టీలను 24 గంటల నుంచి మొదలు మూడు రోజుల పాటుగా నిర్వహిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకుంటారు.

ఈ పార్టీకి కేవలం పరిచయస్తులనే ఇన్వైట్ చేస్తారు. ఎందుకంటే పరిచయం లేని వారిని పిలిస్తే సమాచారం బయటకు పొక్కుతుందని కొత్త వారిని పిలవరు. రేవ్ పార్టీలు గోప్యంగా జరుగుతుంటాయి. ఈ పార్టీల్లో సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొంటుంటారు. ఎందుకంటే రేవ్ పార్టీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రేవ్ పార్టీకి లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. రేవ్ పార్టీల్లో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా చాలానే యవ్వారం జరుగుతుందని సమాచారం. రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం అందడంతో పోలీసులు రైడ్ చేసి గుట్టును రట్టు చేస్తున్నారు. రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎంతటి వ్యక్తులనైనా అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపిస్తున్నారు.

ఇక మందు పార్టీ విషయానికి వస్తే.. బర్త్ డేలు, వివాహాది కార్యక్రమాల్లో మందు పార్టీలు చేసుకుంటుంటారు. ఇలాంటి పార్టీల్లో ఎక్కువమంది పాల్గొంటుంటారు. ఆ సమయాల్లో పెద్ద మొత్తంలో మద్యం వినియోగిస్తుంటారు. మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. హోటళ్లు, రెస్టారెంట్స్, ఇళ్లలో కూడా మందు పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి పార్టీలను మందు పార్టీలు అని పిలుస్తారు. అయితే సాధారణంగా అనుమతి లేని పార్టీలకు పోలీసులు అంగీకరించరు. వ్యక్తిగత పార్టీల్లో భారీ ఎత్తున లిక్కర్ కావాల్సివచ్చినపుడు తప్పనిసరిగా ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. విందు ఏర్పాటు చేస్తూ, అక్కడ పెద్ద మొత్తంలో మద్యం సేవించే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రొహిబిషన్​ అండ్​ ఎక్సైజ్​ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. అనుమతి లేకుండా మందు పార్టీ నిర్వహిస్తే నిర్వాహుకులపై చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. కాగా ఇళ్లల్లో చేసుకునే మందు పార్టీలకు 6 బాటిళ్ల వరకు అనుమతి పొందనవసరం లేదు.