24 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడిని నియమించింది. ఈ మేరకు బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిలో మొత్తం 24 మంది సభ్యులు ఉండగా.. వీరిలో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున అవకాశం కల్పించారు. ఈసారి టీటీడీ పాలకమండలిలో సగం మంది పొరుగు రాష్ట్రాల వారికి అవకాశం కల్పించడం విశేషం. కాగా, 24 మంది సభ్యులను ప్రకటించిన ఆంధ్రప్రభుత్వం.. మరొక సభ్యుడిని నియమించాల్సి ఉంది. బీజేపీ నుంచి మరో పేరు ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆ సభ్యుడిని కూడా నియమించనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు వీరే..
సాంబశివరావు (జాస్తి శివ)
శ్రీసదాశివరావు నన్నపనేని
ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)
పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)
మల్లెల రాజశేఖర్ గౌడ్
జంగా కృష్ణమూర్తి
బురగపు ఆనందసాయి
సుచిత్ర ఎల్లా
నరేశ్‌కుమార్
డా.అదిత్ దేశాయ్
శ్రీసౌరబ్ హెచ్ బోరా
కృష్ణమూర్తి
కోటేశ్వరరావు
దర్శన్. ఆర్.ఎన్
జస్టిస్ హెచ్‌ఎల్ దత్
శాంతారామ్
పి.రామ్మూర్తి
జానకీ దేవి తమ్మిశెట్టి
బూంగునూరు మహేందర్ రెడ్డి
అనుగోలు రంగశ్రీ
ప్రభుత్వానికి ధన్యవాదాలు..
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా తమను నియమించడంపై పలువురు సభ్యులు స్పందించారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ కొత్త సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమిచండం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వెంకటేశ్వర స్వామి సేవలో తరించడానికి దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నారు. బోర్డు సభ్యుడిగా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జ్యోతుల నెహ్రు. టీటీడీ బోర్డు ద్వారా వెంకన్న భక్తులకు మరింత ఉన్నత సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. ప్రతి భక్తుడికి వెంకన్న సులభ దర్శనం జరిగేలాగా బోర్డు ద్వారా చర్యలు చేపడతామన్నారు.