ఐక్యూ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌.. ఫీచర్స్‌ తెలిస్తే షేక్‌ అవ్వాల్సిందే

www.mannamweb.com


చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ 13 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో లేటెస్ట్ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

16 జీబీ ర్యామ్‌ 1 టీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్‌ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ , 1,440 x 3,168 పిక్సెల్స్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్క్రీన్‌ 6 డైనమిక్‌, 12 కలర్‌ కాంబినేషన్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఇక ఈ స్మార్ట్‌ పోన్‌లో 120 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6150 ఎమ్‌ఏహెచ్‌ కెసాపిటీతో కూడిన బ్యాటరీని ఇచ్చారు. ఐపీ68 రేటింతో కూడిన వాటర్‌ రెస్టిసెంట్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్‌, వైఫై 7, బ్లూటూత్‌ 5.4, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు.

ధర విషయానికొస్తే ఐక్యూ ప్రారంభ వేరియంట్‌ 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 47,200, 12GB + 512GB వేరియంట్‌ ధర రూ. 53,100 కాగా.. 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 50,800, 1 టీబీ వేరియంట్‌ ధర విషయానికొస్తే రూ. 61,400 వరకు ఉంటుంది. భారత మార్కెట్లో ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు.