దీపావళి అంటే అందరూ సందడిగా జరుపుకుంటారు. కానీ ఆ గ్రామం పూర్తిగా దీపావళి పండుగకు దూరంగా ఉంటుంది. అక్కడ టపాసులు పేలవు.. దీపాలు కూడా గ్రామంలో కనిపించవు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? పండుగను ఎందుకు జరుపుకోవడం లేదు?
అనకాపల్లి జిల్లాలో ఓ గ్రామంలో ప్రజలు పూర్తిగా దీపావళి పండగకు దూరంగా ఉండటం ఆచారంగా వస్తోంది. అందుకే అక్కడ టపాసులు పేలవు.. దీపాలు కూడా గ్రామంలో కనిపించవు. రావికమతం మండలం కిత్తంపేట గ్రామంలో ఇలా ప్రజలు పండుగకు దూరంగా ఉంటారు. అప్పట్లో ఈ గ్రామంలో కూడా అందరీలాగే దీపావళి సెలబ్రేషన్స్ చేసుకునేవారు. కానీ ఇలా ఆ గ్రామస్తులు మారడానికి ఓ ఘటన కారణమని చెప్పాలి. దీపావళి రోజు నిప్పు రవ్వలు పడి ఓ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండ్లన్ని కాలిపోయాయి. మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు అప్పటి నుంచి దీపావళికి దూరమయ్యారు.
అంతేకాదు.. అప్పట్నుంచి వాళ్ల అనుమానానికి తగ్గట్టుగా దీపావళి నాడు ప్రత్యేక ఏదో ఒకటి కీడు జరుగేదట. దీంతో గ్రామంలో ఎవరు టపాసులు పేల్చడం మానేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అందరూ పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరైన దీపావళి పండుగ జరుపుకోవాలంటే పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి చేసుకుంటారు. నాగుల చవితికి గ్రామమంతా ఏకమవుతారు. పుట్టలో పాలు పోసి అక్కడ టపాసులు పేల్చి ఆనందంగా జరుపుకుంటారు