టాటా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నరా? అయితే ధరతో పటు మైలేజ్, రేంజ్‌ని కూడా చూడటం చాలా ముఖ్యం. అందుకే, టాటా మోటార్స్‌కి చెందిన మోడళ్లు- వాటి మైలేజ్/ రేంజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో లీడింగ్ ఆటోమొబైల్ కంపెనీల్లో టాటా మోటార్స్ ఒకటి. ఈ కంపెనీకి చెందిన అనేక హ్యాచ్‌బ్యాక్, ఎస్యూవీ మోడల్స్ రోడ్డు మీద తిరుగుతున్నాయి. టాటా మోటార్స్ పేరు వినిగానే ముందుగా ‘సేఫ్టీ’ గుర్తొస్తుంది. సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని చాలా మంది టాటా వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇతర సంస్థలతో పోల్చుకుంటే టాటా మోటార్స్ వాహనాల్లో సేఫ్టీతో పాటు మైలేజ్ కూడా మెరుగ్గానే ఉంటోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉన్న వివిధ టాటా మోటార్స్ వాహనాలు, వాటి పెట్రోల్/డీజిల్- సీఎన్జీ- ఈవీకి సంబంధించిన మైలేజ్/ రేంజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది..
టాటా పెట్రోల్, డీజిల్ కార్లు (కేఎంపీఎల్):-
టాటా నెక్సాన్:- పెట్రోల్ మేన్యువల్- 17.44, పెట్రోల్ ఆటోమెటిక్- 17.18 కేఎంపీఎల్; డీజిల్ మేన్యువల్- 23.23, డీజిల్ ఆటోమెటిక్- 24.08;
టాటా పంచ్:- పెట్రోల్ మేన్యువల్- 20.09, ఆటోమెటిక్- 18.8
టాటా ఆల్ట్రోజ్:- డీజిల్ మేన్యువల్- 23.64; పెట్రోల్ మేన్యువల్- 19.33, పెట్రోల్ ఆటోమెటిక్- 19.33
టాటా టియాగో:- పెట్రోల్ మేన్యువల్- 20.09, పెట్రోల్ ఆటోమెటిక్- 19
టాటా టిగోర్:- పెట్రోల్ ఆటోమెటిక్- 19.6, పెట్రోల్ మేన్యువల్ 19.28
టాటా హారియర్:- డీజిల్ మేన్యువల్- 16.8, డీజిల్ ఆటోమెటిక్- 16.8
టాటా సఫారీ:- డీజిల్ మేన్యువల్- 16.3, డీజిల్ ఆటోమెటిక్- 16.3
టాటా సీఎన్జీ కార్లు (కేఎం/కేజీ):-
టాటా నెక్సాన్ సీఎన్జీ:- మేన్యువల్- 17.44
టాటా పంచ్ సీఎన్జీ:- మేన్యువల్- 26.99
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ:- మేన్యువల్- 26.2
టాటా టియాగో సీఎన్జీ:- మేన్యువల్ 26.49, ఆటోమెటిక్ 28.06
టాటా టిగోర్ సీఎన్జీ:- మేన్యువల్ 26.49, ఆటోమెటిక్ 28.06
టాటా ఎలక్ట్రిక్ కార్లు (కి.మీలు):-
టాటా నెక్సాన్ ఈవీ:- 325- 489
టాటా పంచ్ ఈవీ:- 315- 421
టట టియాగో ఈవీ:- 250- 315
టాటా కర్వ్ ఈవీ:- 502- 585
దేశంలో అటు ఐసీఈ/ సీఎన్జీ, ఇటు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో మంచి పోర్ట్‌ఫోలియో ఉన్న సంస్థల్లో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంటుంది. కాగా ఇటీవలే లాంచ్ అవ్వడంతో టాటా కర్వ్ కూపే ఎస్యూవీ మైలేజ్ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
అయితే, ఇవి ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్, రేంజ్ డేటా అని గుర్తుపెట్టుకోవాలి. పలు వాహనాలకు వేరియంట్లు బట్టి మైలేజ్ కాస్త అటు, ఇటుగా మారొచ్చు. కానీ వాహనం కొనుగోలు చేసే ముందు వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. మరిన్ని వివరాల కోసం మీరు మీ స్థానిక డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శించడం ఉత్తమం.