ఈక్విటీ పెట్టుబడుల్లో హైరిటర్న్స్ వస్తాయని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అయితే, తాము ఎంచుకునే పెట్టుబడి మార్గం, స్కీమ్‌పై అది ఆధారపడి ఉంటుంది. స్టాక్ మార్కెట్లు అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా బలమైన ఫోర్ట్ ఫోలియో ఉంటేనే హైరిటర్న్స్ అందుకోవచ్చు. ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఫండ్స్‌లో పెట్టుబడులు అంటే తాము ఎంచుకునే స్కీమ్ గత చరిత్రను పరిశీలించాలని నిపుణులు చెబుతుంటారు. దాని ఆధారంగా భవిష్యత్తులో రిటర్న్స్ అంచనా వేయొచ్చని సూచిస్తుంటారు. కొన్ని స్కీమ్స్ గత కొన్నేళ్లలో హైరిటర్న్స్ అందించాయి. అందులో హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఒకటి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ చాలా రకాల ఈక్విటీ ఫండ్ స్కీమ్స్ అందిస్తోంది. గత 5 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మిడ్ క్యాప్ ఫండ్లలో ఓ స్కీమ్ హైరిటర్న్స్ అందించింది. అదే హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్ (HDFC Mid-cap Opportunities Fund). ఈ స్కీమ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి హైరిటర్న్స్ అందాయి. సగటు వార్షిక రాబడితో పోలిస్తే రెండింతలకు పైగా లాభాలు అందించింది.
రూ.10 వేల పొదుపుతో రూ.13 లక్షలు
హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఆపర్చ్యూనిటీస్ ఫండ్ గత ఐదేళ్లలో తమ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందించింది ఈ స్కీమ్ వార్షిక సగటు రాబడి (XIRR) 32.94 శాతంగా ఉంది. అంటే పెట్టుబడిపై ప్రతి ఏడాది 32.94 శాతం లాభాలు వచ్చాయి. 5 ఏళ్ల క్రితం నెలకు రూ.10 వేల చొప్పున ఈ హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్‌లో క్రమానుగత పెట్టుబడని ప్రారంభించిన వారికి ఇప్పుడు వారి యూనిట్ల విలువ రూ.13,42,340 గా ఉంటుంది.
ఇక మిడ్ క్యాప్ ఫండ్లలో గత ఐదేళ్లలో 30 శాతానికిపైగా వార్షిక రిటర్న్స్ అందించిన వాటిలో పలు దిగ్గజ కంపెనీల స్కీమ్స్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఏకంగా 39.83 శాతం రాబడితో రూ.10 వేల సిప్ పెట్టుబడని రూ. 15.74 లక్షలకపైగా చేసింది. ఆ తర్వాత నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 33.35 శాతం రిటర్న్స్‌తో రూ. 10 వేల సిప్‌ను రూ. 13.55 లక్షలు చేసింది. ఇక ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 30.26 శాతం వార్షిక రాబడి అందించింది. ఆ తర్వాత కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ 30.09 శాతం మేర లాభాలు అందించింది.