ఏ దేశంలో అయితే మహిళలు సురక్షితంగా ఉంటారో. ఆ దేశం నిజమైన అభివృద్ధి చెందినట్లు అని అంటుంటారు. ప్రస్తుతం సమాజంలో మహిళలపై దాడులు పెరుగుతోన్న నేపథ్యంలో అసలు ప్రపంచంలోని ఏ దేశాలు మహిళలకు అత్యంత సురక్షితమైన దేశం ఏంటి..?
అసలు మహిళలకు దేశాలు సురక్షితమా.? కాదా అన్న విసాలను ఎలా పరిగణిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళలకు సురక్షితమైన దేశాన్ని పరిగణించడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు . మహిళలపై హింసకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉండాలి అలాగే వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి . అంతే కాకుండా విద్య, ఉద్యోగాలలో మహిళలకు సమాన అవకాశాలు దక్కాలి. అలాగే మహిళలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి . అలాగే సమాజంలో మహిళలకు సమాన హోదా రావాలి, వారి అభిప్రాయాలను గౌరవించాలి . అంతే కాకుండా దేశంలో లింగ సమానత్వం కోసం కృషి చేయాలి ఇవన్నీ ఉంటే ఆ దేశం మహిళలకు సురక్షితమైన దేశంగా చెప్పొచ్చు.
ఇక అనేక అధ్యయనాలు, సర్వేల అనంతరం ఉత్తర ఐరోపా దేశాలను ప్రపంచంలోని సురక్షితమైన దేశాల జాబితాలో చేర్చారు. చేర్చబడతాయి. ఇందులో ఐస్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ మహిళలకు రాజకీయాలు , వ్యాపారం ఇలా సమాజంలోని అన్ని రంగాలలో సమాన అవకాశాలు లభిస్తాయి.
నార్వే కూడా మహిళలకు అత్యంత సురక్షితమైన దేశంగా చెబుతుంటారు. ఇక్కడ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే అత్యంత కఠిన చర్యలు తీసుకుంటారు. ఇక ఫిన్లాండ్లో విద్య, ఉపాధి మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ మహిళల రాజకీయ భాగస్వామ్యం కూడా చాలా ఎక్కువగా ఉంది. స్వీడన్లో మహిళల కోసం అనేక రకాల సామాజిక భద్రతా పథకాలు ఉన్నాయి. ఇక్కడ స్త్రీలకు ప్రసూతి సెలవులు, శిశు సంరక్షణ సౌకర్యాలు అందిస్తారు. డెన్మార్క్‌లో, లింగ సమానత్వం కోసం మహిళలకు అనేక చట్టపరమైన రక్షణలు అందించారు.