ప్రస్తుతం పారిశ్రామిక పెరిగింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీటి కారణంగా పెద్ద ఎత్తున శబ్ధకాలుష్యం ఎక్కువవుతోంది. సాధారణంగా కాలుష్యం అంటే వాయు కాలుష్యమనే ఆలోచననే ఉంటుంది.
అయితే రోజురోజుకీ శబ్ధకాలుష్యం కూడా ఓ రేంజ్‌లో పెరుగుతోంది. వాయు కాలుష్యంతో సమానంగా శబ్ధ కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా శబ్ధకాలుష్యానికి ప్రభావితమైన వారిలో తీవ్ర సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే శబ్ధ కాలుష్యం కేవలం చెవుల ఆరోగ్యంపైనే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద శబ్ధాల మధ్య ఎక్కువ సమయం గడిపేవారు పలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పెద్ధ శబ్ధాలను ఎక్కువ కాలం వినడం వల్ల చెవి లైనింగ్ దెబ్బతింటుంది. దీని కారణంగా వినే సామర్థ్యం తగ్గిపోతుంది, కొన్ని సందర్భాల్లో పూర్తిగా కోల్పోవచ్చు కూడా. అధిక శబ్ధంతో నిత్యం మ్యూజిక్ వినే వారిలో ఈ సమస్య త్వరగా వస్తుంది.
అలాగే పెద్ద శబ్ధాలు నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది అలసట, చిరాకు, ఏకాగ్రత కోల్పోవడం వంటి ఎన్నో మానసిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే దీర్ఘకాలం శబ్ధ కాలుష్యంకు గురైన వారిలో అధిక రక్తపోటు, గుండె కొట్టుకోవడంలో వేగం పెరగడం వంటి ప్రమాద పరిస్థితులకు కూడా దాఇ తీస్తుంది అంటన్నారు.
ఇక పెద్ధ శబ్ధాలకు ఎక్స్‌పోజ్ అయ్యే వారిలో ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వీరిలో డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీలైనంత వరకు శబ్దాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా హెడ్‌సెట్స్‌లో పెద్ద ఎత్తున వాల్యూమ్ పెట్టుకొని వినడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.