బెండకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. బెండకాయ తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు కూడా బైబై చెప్పొచ్చని పలు పరిధనలు కూడా వల్లడించాయి.
ముఖ్యంగా కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. బెండకాయలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా బెండకాయను అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఉపయోగించే వారు. బెండకాయతో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. మంచి క్లియర్ స్కిన్ కావాలంటే బెండకాయ బెస్ట్. అదే విధంగా జుట్టును కూడా హెల్దీగా చేయవచ్చు. మరి బెండకాయతో ఎలాంటి చర్మ, జుట్టు సమస్యలను నయం చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లోయింగ్:
బెండకాయ తినడం వల్ల కాదు బెండకాయను ముఖానికి రాసుకోవడం వల్ల కూడా మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో ఇతర పోషకాలతో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి స్కిన్ డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. దీంతో మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.
క్లియర్ స్కిన్:
క్లియర్ స్కిన్ కావలంటే బెండకాయ పేస్ట్‌ను ట్రై చేయండి. బెండకాయలో ఉండే గుణాల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు, ముడతలను దూరం చేస్తుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
స్కిన్ హైడ్రేట్:
బెండకాయ ఫేస్ మాస్కులు వేసుకోవడం వల్ల స్కిన్ హైడ్రేట్‌గా తయారవుతుంది. బెండకాయలో హైడ్రేటింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని పొడి బారకుండా.. హైడ్రేట్‌గా ఉంచుతుంది.
కొల్లాజెన్ ఉత్పత్తి:
బెండకాయతో చేసిన కూరలు తిన్నా.. బెండకాయ పేస్ట్ ముఖానికి రాసుకున్నా.. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం ఎప్పుడూ యవ్వనంగా, అందంగా కనిపిస్తుంది.
డ్యాండ్రఫ్ మాయం:
బెండకాయ రసం లేదా పేస్టును తలకు రాయడం వల్ల డ్యాండ్రఫ్ అనేది మాయం అవుతుంది. డ్యాండ్రఫ్ తగ్గడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. డ్యాండ్రఫ్ సమస్యతో బాధ పడేవారు బెండకాయ గుజ్జు తలకు పట్టించండి.
హెయిర్ గ్రోత్:
తలకు బెండకాయ పేస్టు రాయడం కుదుళ్లు స్ట్రాంగ్‌గా ఉంటాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. బెండకాయలను నీటిలో వేసి మరిగించిన నీటిని తాగినా, జుట్టుకు పట్టించిన కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)