రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ఎప్పుడు లాంచ్ అవుతుంది

www.mannamweb.com


రాయల్ ఎన్ఫీల్డ్ రాబోయే నెలల్లో భారతీయ మార్కెట్లో అనేక కొత్త ఉత్పత్తులను పరిచయం చేయబోతోంది. అలాగే వాటిలో ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు మొదటి స్క్రాంబ్లర్ బైక్ కూడా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన రాబోయే మోటార్‌సైకిల్‌కు బేర్ 650 అని పేరు పెట్టింది కంపెనీ. దాని లీకైన టీజర్ కూడా బయటకు వచ్చింది. 650 cc సెగ్మెంట్ ఈ రాబోయే మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ 650 తేలికపాటి, ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ వెర్షన్‌గా పరిగణిస్తున్నారు. ఇది గొప్ప లుక్స్, అప్‌గ్రేడ్ ఫీచర్లతో వస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 లుక్, ఫీచర్ల గురించి .. నియో-రెట్రో డిజైన్‌తో ఉన్న ఈ మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కాంపాక్ట్ రియర్ డిజైన్, రెట్రో లుకింగ్ ఇండికేటర్‌లు, సింగిల్ పీస్ సీట్ సెటప్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు స్టీల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్, సింగిల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, 5 అంగుళాల ట్రిప్పర్ డాష్ ఉంటాయి. బేర్ 650లో గూగుల్ మ్యాప్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను కూడా చూడవచ్చు. రాబోయే రోజుల్లో ఈ బేర్ 650 గురించి సమాచారం వెల్లడి కానుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 ఇంజన్, పవర్ గురించి చెప్పాలంటే, కంపెనీకి చెందిన ఇతర 650 సిసి మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఇది 648 సిసి ప్యారలల్ ట్విన్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుందిజ ఇది గరిష్టంగా 47 బిహెచ్‌పి పవర్‌ని, 52 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉండనుంది. ఈ బైక్ సింగిల్, డ్యూయల్ టోన్ వంటి రెండు రంగుల్లో లభించనున్నట్లు తెలుస్తోంది.