సాధారణంగా సందీప్ కథలలోని పాత్రలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటారు. అతను చెప్పాలనుకున్న కంటెంట్ ను బలమైన క్యారెక్టర్స్ తో స్క్రీన్ మీద చూపిస్తాడు. ఆల్రెడీ అర్జున్ రెడ్డి , యానిమల్ సినిమాలలో సందీప్ వర్క్ ఏంటో అందరికి అర్థమైంది. మొదట హీరోలను చాలా సింపుల్ గా చూపించినా కూడా.. కథ ముందుకు తీసుకువెళ్లే కొద్దీ.. వారి క్యారెక్టర్ స్లో గా ఛేంజ్ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టరైజషన్ కారణంగానే సినిమా ఆడియన్స్ కు స్లో పాయిజన్ లా ఎక్కేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ తో తీయబోయే స్పిరిట్ విషయంలోనూ ఇదే జరగబోతుంది. ఆల్రెడీ స్పిరిట్ గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు వింటూ వస్తున్నారు ప్రేక్షకులు. ప్రభాస్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ అని.. ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నాడని అనే విషయాలు తెలిసిందే. అదంతా నిజమే ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ గానే కనిపిస్తాడు. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ.. అందులోని ట్విస్ట్ ల కారణంగా ప్రభాస్ క్యారెక్టర్ గ్యాంగ్ స్టర్ గా మారుతుందట. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్ లో ఇలాంటి పాత్రను టచ్ చేయలేదు. పోలీస్ గా ప్రభాస్ ను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.. అలాంటిది ఇప్పుడు గ్యాంగ్ స్టర్ రేంజ్ అంటుంటే.. ఇది ఖచ్చితంగా థియేటర్స్ తగలపడిపోయే న్యూస్ అని చెప్పాల్సిందే.
దీనితో ఈ న్యూస్ ఇప్పుడు సినిమాపై ఇంకాస్త అంచనాలను పెంచేసింది. పైగా ఇప్పటివరకు సందీప్ తీసిన సినిమాలకు మించిన వైలెన్స్ ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. సినిమా అంతా కూడా గ్యాంగ్స్ , గన్స్ , డ్రగ్స్ నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తుంది. అసలే ఆరడుగుల కట్ అవుట్ .. సరిగ్గా నుంచుంటే స్క్రీన్ కూడా సరిపోదని టాక్.. పోయి పోయి సందీప్ చేతికి చిక్కాడు. అక్కడ స్క్రిప్ట్స్ అన్నీ కూడా వైలెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇక మధ్యలో ఇలాంటి హీట్ ఎక్కించే అప్డేట్స్. ఇవన్నీ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర వీరిద్దరూ కలిసి చేసే విధ్వంసం కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమా నుంచి రాబోయే అప్డేట్స్ అందరికి పూనకాలు తెప్పిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ ను స్క్రీన్ మీద చూడడం కొత్తేమి కాదు.. కానీ సందీప్ రెడ్డి ఏ రేంజ్ లో చూపిస్తాడా అనే దానిమీదే ఇప్పుడు ఆడియన్స్ కంప్లీట్ ఫోకస్ పెట్టారు.